Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయతీపై క్రిమినల్ కేసు నమోదు.. ఆమె భర్త మీదకూడా..

Dimple Hayathi Case registered: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీపై ఫిల్మ్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆమె భర్త మీదకూడా..

Dimple Hayathi: హీరోయిన్ డింపుల్ హయతీపై క్రిమినల్ కేసు నమోదు.. ఆమె భర్త మీదకూడా..

Dimple Hayathi Case registered

Updated On : October 1, 2025 / 9:56 AM IST

Dimple Hayathi Case registered: టాలీవుడ్ హీరోయిన్ డింపుల్ హయతీపై కేసు నమోదైంది. ఆమె ఇంట్లో పనిమనిషి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫిలింనగర్ పోలీస్ స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. జీతం విషయంలో పని మనిషిపై డింపుల్ హయతి దూషణలు చేసినట్లు పనిమనిషి ఫిర్యాదులో పేర్కొంది.

పనిమనిషి ఫిర్యాదు మేరకు హీరోయిన్ డింపుల్ హయతీ పై ఫిలింనగర్ పోలీసులు కేసు నమోదు చేశారు. జీతం విషయంలో పని మనిషిపై డింపుల్ దూషణలు చేశారు. నా చెప్పుల విలువ కాదు నీ బతుకు అంటూ అకారణంగా దూషించడంతోపాటు.. దాడి చేసినట్లు పనిమనిషి ఫిర్యాదులో పేర్కొన్నారు. పని మనిషి ఇచ్చిన ఫిర్యాదుతో డింపుల్ హయతీతో పాటు ఆమె భర్త మీద క్రిమినల్ కేసు నమోదైంది. అయితే, ఈ ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

వివరాల్లోకి వెళితే.. ఒడిశా రాష్ట్రం రాయ్‌ఘడ్ జిల్లాకు చెందిన ప్రియాంక బిబర్ అనే మహిళ షేక్‌పేటలోని వెస్ట్‌వుడ్ అపార్టుమెంట్స్‌లో ఉంటున్న హీరోయిన్ డింపుల్ హయాతి ఇంట్లో పనిమనిషిగా పనిచేస్తుంది. అయితే, డింపుల్, ఆమె భర్త డేవిడ్ తనను దూషిస్తూ, అవమానిస్తూ సరైన ఆహారం ఇవ్వకుండా హింసుస్తున్నారని ప్రియాంక ఫిర్యాదులో పేర్కొంది.

మంగళవారం ఉదయం ఇంట్లో పెంపుడు కుక్క అరిచిందని, అందుకు కారణం తానేనంటూ భార్యాభర్తలిద్దరూ అసభ్య పదజాలంతో దూషించారని, తనను నగ్నంగా మార్చి కొట్టేందుకు యత్నించారని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. అదేవిధంగా.. జీతం విషయంలోనూ వారు ఇబ్బంది పెడుతున్నారంటూ ప్రియాంక తన ఫిర్యాదులో పేర్కొంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు డింపుల్ హయతీ, ఆమె భర్తపై పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

Also Read: LPG Price Hike : పండుగల వేళ బిగ్ షాకిచ్చిన గ్యాస్ సిలిండర్ ధరలు.. ప్రధాన నగరాల్లో ధరల వివరాలు ఇలా..