Musi River : మూసీలో మొసలి .. హడలిపోయిన స్థానికులు

హైదరాబాద్ లోని మూసీ నదిలో మొసలి కలకలం సృష్టించింది. నదిలో మొసలిని చూసి స్థానికులు హడలిపోయారు.

Musi River : మూసీలో మొసలి .. హడలిపోయిన స్థానికులు

Crocodile In Musi river : మూసీ నదిలో మొసలి కలకలం సృష్టించింది. రంగారెడ్డి జిల్లా రజేంద్రనగర్ అత్తాపూర్ ప్రాంతంలోని మూసి నదిలో ఓ మొసలి కనిపించింది. నదిలోని ఓ బండమీదకు చేరి చక్కగా సేదతీరుతున్న మొసలిని స్థానికులు చూశారు. అంతే ఒక్కసారిగా హడలిపోయారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు.

మూసీ నది పరివాహక ప్రాంతంలో పని చేస్తున్న కార్మికులు నదిలో బండపై సేదతీరుతున్న మొసలిని చూసి భయభ్రాంతులకు గురయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. మూసి నదిలో ఈ ఒక్క మొసలే కాదు ఇంకా చాలానే ఉన్నాయని చెబుతున్నారు స్థానికులు. గతంలో నాలుగు మొసళ్లను చూశామంటున్నారు.

హిమాయత్ సాగర్, గండిపేట జలాశయం నుండి మూసీనదిలోకి మొసళ్లు కొట్టుకొస్తున్నాయి. ఈక్రమంలో నదీ పరివాహన ప్రాంతాల్లో ఉండే పలు నివాసులు భయభ్రాంతులకు గురవుతున్నారు. నదిలోంచి అవి బయటకు వచ్చినా..లేదా మరో రకంగా అయినా వాటితో ప్రమాదం కలుగుతుందని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. వెంటనే మొసళ్లను పట్టుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

కాగా..వర్షాకాలం సీజన్ లో పలు ప్రాంతాల్లో మొసళ్లు కలకలం సృష్టింటాయి. భారీ వర్షాలకు తోడు వరదనీరు పెరిగి ఈ నీటిలో కొట్టుకొస్తుంటాయి. దీంతో ఆయా ప్రాంతాల స్థానికులు భయాందోళనలకు గురవుతుంటారు.