New Year Celebrations : ఫ్లైఓవర్లు మూసివేత, ఔటర్ రింగ్ రోడ్‌పై ఆంక్షలు.. న్యూఇయర్ వేడుకలకు పోలీసుల ఆంక్షలు

బార్లు, పబ్బులు, క్లబ్బుల్లో.. న్యూఇయర్ వేడుకల్లో మద్యం సేవించిన వారు స్వయంగా వాహనాలు నడిపేందుకు అనుమతించొద్దని పేర్కొన్నారు.

New Year Celebrations : ఫ్లైఓవర్లు మూసివేత, ఔటర్ రింగ్ రోడ్‌పై ఆంక్షలు.. న్యూఇయర్ వేడుకలకు పోలీసుల ఆంక్షలు

Cyberabad police issue guidelines and restrictions for new year celebrations

Updated On : December 27, 2023 / 8:39 PM IST

నూతన సంవత్సర వేడుకల సందర్భంగా పలు మార్గదర్శకాలు జారీ చేశారు సైబరాబాద్ పోలీసులు. ట్రాఫిక్ డైవర్షన్స్, ఫ్లైఓవర్ల మూసివేత, సాధారణ పౌరులు అనుసరించాల్సిన నిబంధనలతో పాటు ఈవెంట్స్ సందర్భంగా పాటించాల్సిన నిబంధనలను విడుదల చేశారు. బార్లు, పబ్బులు, క్లబ్బుల్లో.. న్యూఇయర్ వేడుకల్లో మద్యం సేవించిన వారు స్వయంగా వాహనాలు నడిపేందుకు అనుమతించొద్దని పేర్కొన్నారు. ఒకవేళ అలా చేస్తే సంబంధిత యాజమాన్యాలపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

వాహనదారులు, ప్రయాణికుల భద్రతల నేపథ్యంలో సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని పలు ఫ్లైఓవర్లను మూసివేస్తారు. డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుండి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఫ్లైఓవర్లపై రాకపోకలు నిలిపివేస్తారు. ఇక క్యాబ్స్, ట్యాక్సీ, ఆటో డ్రైవర్లు కచ్చితంగా యూనిఫామ్ ధరించాలని, ఎట్టి పరిస్థితుల్లో రైడ్స్ నిరాకరించొద్దని పేర్కొన్నారు.

Also Read : అభయ హస్తం 6 గ్యారెంటీల దరఖాస్తులు ఎలా నింపాలి.. ఏయే పత్రాలు కావాలి?

నిబంధనలు ఉల్లంఘించిన వారికి 500 రూపాయలు జరిమానా విధిస్తామని పోలీసులు తెలిపారు. ఓవర్ స్పీడ్, రాంగ్ రూట్, సిగ్నల్ జంప్, ర్యాష్ డ్రైవింగ్ తో పాటు హెల్మెట్ లేకుండా వాహనాలు నడిపే వారిపైనా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సైబరాబాద్ పరిధిలోని అన్ని రహదారులపై రాత్రి 8గంటల నుంచి డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని పోలీసులు వెల్లడించారు. ప్రయాణికుల భద్రత నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోవాలని పోలీసులు సూచించారు.

* సైబరాబాద్ పరిధిలో ఉన్న అన్ని ఫ్లైఓవర్లు మూసివేత
* ఔటర్ రింగ్ రోడ్ మూసివేత
* PVNR ఎక్స్ ప్రెస్ వేపై ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి
* న్యూ ఇయర్ వేళ ఆటో, ట్యాక్సీ, క్యాబ్ డ్రైవర్లకు పోలీసుల హెచ్చరిక
* అధిక చార్జీలు వసూలు చేస్తే పెనాల్టీతో పాటు చర్యలు
* పబ్ లలో మద్యం సేవించి వాహనం నడపకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఈవెంట్ నిర్వాహకులదే

Also Read : కొత్త రేషన్ కార్డులు వెంటనే ఇవ్వాలి: ఎమ్మెల్సీ కవిత

* ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించకుండా స్పెషల్ కెమెరాలు ఏర్పాటు
* డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుండి సైబరాబాద్ లిమిట్స్ లో డ్రంకెన్ డ్రైవ్ తనిఖీలు
* మద్యం మత్తులో తాగి రోడ్డు ప్రమాద మరణానికి కారణమైతే వారిపై మర్డర్ కేసులు నమోదు
* న్యూఇయర్ సందర్భంగా పలు రోడ్డు మార్గాలు మూసివేత
* ఓఆర్ఆర్ పై డిసెంబర్ 31 రాత్రి 10 నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు ఆంక్షలు
* ఎయిర్ పోర్టు వెళ్లే వాహనాలు, లైట్ మోటార్ వెహికల్స్ కు మాత్రమే అనుమతి

* పీవీఎన్ ఆర్ ఎక్స్ ప్రెస్ వేపై ఎయిర్ పోర్టుకు వెళ్లే వాహనాలకు మాత్రమే అనుమతి
* డిసెంబర్ 31 రాత్రి 11 నుంచి ఉదయం 5 వరకు పలు ఫ్లైఓవర్లు మూసివేత
* శిల్పా లే ఔట్, గచ్చిబౌలి ఫ్లైఓవర్, బయో డైవర్సిటీ ఫ్లైఓవర్లు 1,2,4,.. షేక్ పేట ఫ్లైఓవర్, మైండ్ స్పేస్ ఫ్లైఓవర్, రోడ్ నెంబర్ 45 ఫ్లైఓవర్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, సైబర్ టవర్ ఫ్లైఓవర్, ఫోరమ్ మాల్ – జేఎన్టీయూ ఫ్లైఓవర్, కైత్లాపూర్ ఫ్లైఓవర్, బాబూ జగ్జీవన్ రామ్ ఫ్లైఓవర్(బాలానగర్) మూసివేత.