T.Congress : కాంగ్రెస్‌లోకి డీఎస్.. ముహూర్తం ఫిక్స్
జనవరి 24వ తేదీన సోనియా గాంధీ సమక్షంలో డి.శ్రీనివాస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. డీఎస్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా...
D.Srinivasa Rao Joins Congress : టీఆర్ఎస్ రాజ్యసభ ఎంపీ డి.శ్రీనివాస్ తిరిగి సొంత గూటికి వెళ్తున్నారు. ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. ఇందుకు ముహూర్తం కూడా ఫిక్స్ అయ్యింది. టీఆర్ఎస్ పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉంటూ వస్తున్న ఆయన…కాంగ్రెస్ పార్టీలో చేరుతారని జోరుగా ప్రచారం జరిగింది. అంతేగాకుండా..ఆయన ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ పెద్దలతో సమాలోచనలు జరిపారు. కానీ…ఆయన చేరిక ఎప్పుడనేది ఫిక్స్ కాలేదు.
Read More : Pocharam Srininivas Corona : తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డికి రెండోసారి కరోనా
తాజాగా…2022, జనవరి 24వ తేదీన సోనియా గాంధీ సమక్షంలో డి.శ్రీనివాస్ పార్టీ కండువా కప్పుకోనున్నారు. డీఎస్.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మంత్రిగా, పీసీసీ చీఫ్‌గా పని చేశారు. 2004లో పీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలోనే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం 2014లో తెలంగాణలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక డీ.శ్రీనివాస్ టీఆర్ఎస్ లో చేరారు. కాంగ్రెస్ లో తనకు ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారని డీఎస్ ఆరోపించారు. అదే సమయంలో టీఆర్ఎస్ నుండి ఆహ్వానం రావడంతో ఆయన కారెక్కారు. అయితే, నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు డీఎస్ పై పార్టీ పెద్దలకు ఫిర్యాదు చేశారు. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై కేసీఆర్ ను కలిసే ప్రయత్నం చేసినా డీఎస్ కు అపాయింట్‌మెంట్ లభ్యం కాలేదనే టాక్ ఉంది. అప్పటి నుండి ఆయన టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్నారు.
Read More : COVID-19: కొవిడ్ అంతం అతి త్వరలోనే – యూఎస్ వైరాలజిస్ట్
ఎంపీ పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. డీఎస్ కాంగ్రెస్ లో చేరతారని కొంతకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. బీజేపీలోకి వెళ్తారనే ప్రచారమూ నడిచింది. కాగా, డీఎస్ తనయుడు అరవింద్ గత ఎన్నికల్లో బీజేపీ తరఫున నిజామాబాద్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించాడు. ఆయన విజయం వెనుక.. డీఎస్ కీలకంగా వ్యవహరించారనే టాక్ వినిపించింది. ఆయన తిరిగి కాంగ్రెస్ లోకి వస్తుండడం పట్ల కొంతమంది సీనియర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఆయన చేరితే..కొడుకును కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపించాలని ఇటీవలే సీనియర్ నేత వీహెచ్ కామెంట్ చేశారు. డీఎస్ చేరిక తర్వాత కాంగ్రెస్ లో మరోసారి విబేధాలు పొడచూపుతాయా ? లేదా ? అనేది చూడాలి.