నాగోబా జాతరలో ఇదే హైలైట్.. 1942లో హేమన్ డార్ఫ్ అనే కలెక్టర్ చేసిన పని.. ఇప్పటికీ ఫాలో అవుతారు..

జాతరకు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు.

నాగోబా జాతరలో ఇదే హైలైట్.. 1942లో హేమన్ డార్ఫ్ అనే కలెక్టర్ చేసిన పని.. ఇప్పటికీ ఫాలో అవుతారు..

Nagoba Jatara

Updated On : January 31, 2025 / 9:55 AM IST

ఆసియాలో 2వ అతిపెద్ద ఆదివాసీ వేడుక నాగోబా జాతర వైభవంగా కొనసాగుతోంది. నాగోబా జాతరకు భక్తుల రద్దీ పెరుగుతోంది. ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్‌లో నాగోబా జాతర జరుగుతుందన్న విషయం తెలిసిందే. ఇవాళ నాగోబా దర్బార్, రేపు బేతల్ పూజలు, మండగాజిలింగ్.. ఎల్లుండి షాంపూర్ జాతర జరుగుతాయి.

జాతర 3వ రోజున దర్బార్ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. గిరిజనుల సమస్యలపై కలెక్టర్ ఆధ్వర్యంలో దర్బార్ నిర్వహిస్తారు. సమస్యలను నేరుగా అధికారులు-ప్రజాప్రతినిధులకు తెలిపేందుకు దర్బార్ జరుగుతుంది. 1942లో మొట్టమొదటిసారి నాగోబా దర్బార్ నిర్వహించారు.

Araku Chali Utsav: 3 రోజులపాటు అరకు చలి ఉత్సవ్‌.. ఎలా జరుపుకుంటారో తెలుసా?

తొలిసారి నిర్వహించిన ఈ దర్బార్ హేమన్ డార్ఫ్ ఆధ్వర్యంలో జరిగింది. అడవిబిడ్డల సమస్యలపై అధ్యయనం చేయడానికి ఆనాడు హేమన్ డార్ఫ్ ను నిజాం సర్కార్ పంపింది. హేమన్ డార్ఫ్ మొదలు పెట్టిన దర్బార్ నేటికీ కొనసాగుతోంది. దర్బార్ కోసం గిరిజనులు-ఆదివాసీలు భారీగా తరలిరానున్నారు.

అయితే, ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ ఉండడంతో ఈ సారి నామమాత్రాంగానే దర్బార్ జరుగుతుంది. కాగా, జాతరకు తెలంగాణతో పాటు పలు రాష్ట్రాల నుంచి భక్తులు పెద్దఎత్తున తరలివస్తున్నారు. నాగోబాను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు.