దసరా సెలవులు 28 నుంచే..

దసరా సెలవులు 28 నుంచే..

Updated On : September 17, 2019 / 2:01 AM IST

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేట్ విద్యాసంస్థలకు సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు వర్తించనున్నాయి. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం.. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని పాఠశాలలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 13వరకూ విజయ దశమి సందర్భంగా సెలవులు ఇవ్వనున్నట్లు పాఠశాల విద్యాశాఖ ప్రకటించింది.

సెలవుల అనంతరం అక్టోబర్ 14న పాఠశాలలు పున: ప్రారంభం అవుతాయని తెలిపారు. అలాగే రాష్ట్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, ప్రైవేటు జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 9వరకూ దసరా సెలవులు ఇవ్వనున్నట్లు ఇంటర్ బోర్డు వర్గాలు వెల్లడించాయి. కాలేజీలు పున: ప్రారంభం అక్టోబర్ 10నుంచి అని బోర్టు ప్రకటించింది.

అంటే అక్టోబర్ 2న జరగనున్న గాంధీ జయంతిని.. విద్యార్థులంతా దసరా సెలవుల్లోనే జరుపుకోవాలన్న మాట.