Dasari Arun Released: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో దాసరి అరుణ్ విడుదల
దాసరి నారాయణరావు రెండో కుమారుడు దాసరి అరుణ్ కుమార్‌కు నోటీసులు ఇచ్చి పంపేశారు పోలీసులు.

Dasari Arun Released
Dasari Arun Released: మద్యం సేవించి వాహనం నడిపి ఇద్దరిని ఢీకొట్టిన కేసులో బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో హాజరైన దర్శకరత్న దాసరి నారాయణరావు రెండో కుమారుడు దాసరి అరుణ్ కుమార్‌కు నోటీసులు ఇచ్చి పంపేశారు పోలీసులు. దీంతో పోలీస్ స్టేషన్ నుంచి తన నివాసానికి బయల్దేరారు దాసరి అరుణ్ కుమార్.
దాసరి అరుణ్ కుమార్‌పై డ్రంక్ అండ్ డ్రైవ్ యాక్ట్ 1988 ఐపీసీ section 185 & 336 కింద కేసులను నమోదు చేశారు పోలీసులు. కేసు నమోదు చేసిన తర్వాత ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అరుణ్‌ని అదుపులోకి తీసుకున్నారు.
Bomb Blast : పాకిస్తాన్ లో మరోసారి బాంబు పేలుడు.. ఇద్దరు మృతి, 20 మందికి గాయాలు
తర్వాత ఉస్మానియా ఆసుపత్రికి తరలించి పరీక్షలు నిర్వహించగా మద్యం సేవించి వాహనం నడిగినట్టు గుర్తించారు పోలీసులు.