Kavitha Bail Plea : ఎమ్మెల్సీ కవితకు కోర్టులో దక్కని ఊరట..

వివిధ కేసుల్లో మహిళలకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ అంశాలను కోర్టు ముందు ప్రస్తావించారు అభిషేక్ మను సింఘ్వి.

Kavitha interim bail plea

Kavitha Bail Plea : కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై రౌస్ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఏప్రిల్ 8న ఉదయం 10.30కు తీర్పు వెలువరించనుంది కోర్టు. రెగులర్ బెయిల్ పిటిషన్ పై ఏప్రిల్ 20న విచారణ జరుగుతుంది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. కవిత మధ్యంతర బెయిల్ పిటిషన్ పై విచారణ జరిపిన కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.

మధ్యాహ్నం 3 గంటల నుంచి సుమారు గంటకుపైగా వాడీవేడి వాదనలు జరిగాయి. కవిత తరుపున సీనియర్ లాయర్ అభిషేక్ మనుసింఘ్వి వాదనలు వినిపించారు. ఈడీ తరుపున సీనియర్ న్యాయవాది జోయఫ్ హుస్సేన్ వాదనలు వినిపించారు. ఒక మహిళగా, చిన్న కొడుక్కి పరీక్షల నిమిత్తం కవితకు మధ్యంతర బెయిల్ ఇవ్వాలని వాదించారు. వివిధ కేసుల్లో మహిళలకు ఇచ్చిన మధ్యంతర బెయిల్ అంశాలను కోర్టు ముందు ప్రస్తావించారు అభిషేక్ మను సింఘ్వి.

కవిత చిన్న కుమారుడికి 16ఏళ్ల వయసు అని తెలిపారు. అలాగే అతడి ఎగ్జామ్ షెడ్యూల్ కూడా కోర్టు ముందు ఉంచారు సింఘ్వి. తన తల్లి అరెస్ట్ అయిందన్న ఆందోళనలో కుమారుడు ఉన్నాడు, తల్లి పక్కనే ఉంటే అతడికి కొంత మోరల్ సపోర్ట్ ఉంటుందని వాదనలు వినిపించారు సింఘ్వి. కుటుంబ బాధ్యతలకు సంబంధించి తండ్రి లేదా సోదరుడు ఇతరులు ఎవరూ కూడా తల్లి పాత్రను భర్తీ చేయలేరని, ఏప్రిల్ 16వ తేదీ వరకు పరీక్షలు ఉన్నందున కచ్చితంగా మధ్యంతర బెయిల్ ఇవ్వాలని, షరతులతో కూడిన బెయిల్ ఇచ్చినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదని సింఘ్వి వాదనలు వినిపించారు.

కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించాలని ఈడీ గట్టిగా కోరింది. కవితకు బెయిల్ ఇస్తే సాక్ష్యాలను తారుమారు చేయగల వ్యక్తి అని వాదనలు వినిపించారు ఈడీ తరుపు లాయర్. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రధారి, అవినీతి కార్యకలాపాల్లో నిమగ్నమైన వ్యక్తి, ఢిల్లీ లిక్కర్ కేసుకు మూలమైన వ్యక్తి కవితకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టు ముందు వాదనలు వినిపించారు ఈడీ తరుపు న్యాయవాది.

 

Also Read : పెద్దపల్లిలో బస్తీమే సవాల్‌.. ఈ ముగ్గురిలో విక్టరీ కొట్టేదెవరు?

 

ట్రెండింగ్ వార్తలు