Fancy Number : మీ బండికి ఫ్యాన్సీ నెంబర్ కావాలా? రవాణా శాఖ సూచనలివే.. గడువు పెంపు..
Transport Department : రవాణాశాఖ తాజా నిర్ణయం ప్రకారం.. వాహన యాజమానులకు తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్లను ఎంపిక చేసుకునేందుకు మరింత సమయం లభించనుంది.
Transport Department
- మీ బండికి ఫ్యాన్సీ నెంబర్ కావాలా..
- రవాణాశాఖ కొత్త నిబంధనలు ఇవే..
- ఫ్యాన్సీ నెంబర్లకు రెండు నెలల వ్యవధి
Fancy Number : మీ బండికి ఫ్యాన్సీ నెంబర్ కావాలా.. అయితే, కొత్త నిబంధనలు అమల్లోకి వచ్చాయి. ప్రస్తుతం కోరిన వెంటనే ఆన్లైన్లో అత్యధిక ధర కోట్ చేసిన వారికి రవాణా శాఖ అధికారులు నెంబర్లు ఇస్తున్నారు. తాజాగా.. కొత్త నిబంధన అమల్లోకి తీసుకొచ్చారు.
కొత్త వాహనాలకు ఫ్యాన్సీ నెంబర్లకు గడువును పెంచుతూ రవాణాశాఖ నిర్ణయం తీసుకుంది. ఇకపై కొత్తగా కొనుగోలు చేసిన వాహనాలకు ఫ్యాన్సీ రిజిస్ట్రేషన్ నెంబర్లను ఎంపిక చేసుకునేందుకు తాత్కాలిక నమోదు తేదీ నుంచి రెండు నెలల వ్యవధిని కల్పిస్తున్నట్లు రాష్ట్ర రవాణాశాఖ ప్రకటించింది.
ప్రస్తుతం అమల్లో ఉన్న విధానం ప్రకారం.. కొత్త వాహనాలకు జారీ చేసే తాత్కాలిక నమోదు గడువు 30రోజులుగా ఉంది. అయితే, వాహన యజమానుల సౌకర్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఫ్యాన్సీ లేదా ప్రత్యేక నంబర్లను ఎంపిక చేసుకునే సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు.. తాత్కాలిక నమోదు తేదీని నుంచి రెండు నెలలకు పెంచినట్లు అధికారులు తెలిపారు.
తాత్కాలిక నమోదు తేదీ నుంచి రెండు నెలల గడువు ముగిసిన తర్వాత కూడా ప్రత్యేక నంబర్ ను ఎంపిక చేయని పక్షంలో, వ్యవస్థ ద్వారా సాధారణ లేదా యాదృచ్ఛిక రిజిస్ట్రేషన్ నంబర్ స్వయంచాలకంగా కేటాయించబడుతుందని రవాణా శాఖ స్పష్టం చేసింది. తాజా నిర్ణయం ద్వారా.. వాహన యాజమానులకు తమకు నచ్చిన ఫ్యాన్సీ నంబర్లను ఎంపిక చేసుకునేందుకు మరింత సమయం లభించనుంది.
