Telangana Mahila Congress : మేము ప్రచారం చెయ్యం.. కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ షాక్, ఎందుకో తెలుసా

క్షేత్రస్థాయిలో మహిళా కాంగ్రెస్ బలంగా ఉంది. అన్ని జిల్లాల్లో మహిళా కాంగ్రెస్ కి మండల అధ్యక్షులను నియమించాం. 51 శాతం ఉన్న మహిళలు.. Telangana Mahila Congress

Telangana Mahila Congress : మేము ప్రచారం చెయ్యం.. కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ షాక్, ఎందుకో తెలుసా

Telangana Mahila Congress (Photo : Google)

Telangana Mahila Congress – Seats : కాంగ్రెస్ అధిష్టానానికి తెలంగాణ మహిళా కాంగ్రెస్ అల్టిమేటం ఇచ్చింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మహిళా కాంగ్రెస్ నేతలకు సీట్లు కేటాయించకపోతే ఏ మహిళా కాంగ్రెస్ చెల్లెమ్మ కూడా ఓట్ల కోసం తిరగొద్దని తీర్మానం చేశారు. ఢిల్లీలో మహిళా కాంగ్రెస్ జాతీయ సదస్సులో మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు పాల్గొన్నారు.

వార్డు, గ్రామస్థాయిలో పార్టీ బలోపేతం, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై కాంగ్రెస్ దృష్టి సారించింది. మహిళ కాంగ్రెస్ కి దిశానిర్దేశం చేసింది అధిష్టానం. రెండు రోజులపాటు శిక్షణ కార్యక్రమాల నిర్వహించింది కాంగ్రెస్ హైకమాండ్. ఢిల్లీ తాల్కటోరా స్టేడియంలో రెండు రోజులపాటు మహిళా కాంగ్రెస్ జాతీయ సదస్సు జరిగింది. రాష్ట్ర స్థాయి నుంచి బ్లాక్ స్థాయి వరకు ఉన్న మహిళా కాంగ్రెస్ నేతలు పాల్గొన్నారు.

Also Read..Sanathnagar Constituency: టీడీపీ చీల్చే ఓట్లపైనే గెలుపు అవకాశాలు.. సనత్‌నగర్‌లో ఈసారి కనిపించబోయే సీనేంటి?

”తెలంగాణ మహిళా కాంగ్రెస్ నేతలకు ఎన్నికల్లో అడిగినన్ని స్థానాలు దక్కడం లేదు. మహిళ సాధికారత గురించి మాట్లాడే నేతలు, మాకు ఎన్ని సీట్లు ఇస్తారని అడిగాం. అసెంబ్లీ ఎన్నికలు వచ్చినప్పుడు ఎవరెవరికో సీట్లు ఇస్తున్నారు. కానీ, మహిళల కోటా తేలడం లేదు. వారం రోజుల్లో మహిళా డిక్లరేషన్ చేసేందుకు ప్రియాంక గాంధీ తెలంగాణ వస్తున్నారు. 51 శాతం ఉన్న మహిళలు మా సీట్ల కోసం మేము పోరాటం చేయాలని నిర్ణయం తీసుకున్నాం.

టికెట్లు ఎక్కడైతే నిరాకరిస్తారో అక్కడ ప్రచారానికి తిరగం. తెలంగాణలో చాలా నియోజకవర్గాల్లో పోటీకి మహిళా కాంగ్రెస్ నేతలు సిద్ధంగా ఉన్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో మహిళా కాంగ్రెస్ కి మండల అధ్యక్షులను నియమించాం. క్షేత్రస్థాయిలో మహిళా కాంగ్రెస్ బలంగా ఉంది. మాకు సీట్లు ఇస్తే ఇంటి ఇంటి ప్రచారం చేస్తాం. సీట్లు ఇవ్వకపోతే ప్రచారం చెయ్యం. కేసి వేణుగోపాల్ పోరాటం మా హక్కు అన్నారు. తెలంగాణలో మహిళా కాంగ్రెస్ సీట్ల కోసం పోరాడతాం” అని తెలంగాణ మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సునీత రావు తేల్చి చెప్పారు.

Also Read..Serilingampally Constituency: శేరిలింగంపల్లిలో త్రిముఖ పోరు తప్పదా.. బరిలోకి టీడీపీ అభ్యర్థి?