Dowry Incident : ఇదేందయ్యా ఇది ఏడా సూడలె.. ఎదురు కట్నం సరిపోలేదని పెళ్లికి నో చెప్పిన వధువు, షాక్‌లో వరుడు

పెళ్లి కూతురు.. పెళ్లి కొడుక్కి, అతడి బంధువులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కాసేపట్లో పెళ్లి అనగా.. సరిగ్గా తాళి కట్టే ముహూర్తం సమయానికి వధువు పెళ్లికి నో చెప్పింది. ఎదరు కట్నం సరిపోదు, నాకీ పెళ్లి ఇష్టం లేదని తేల్చి చెప్పేసింది. దీంతో వరుడు, అతడి బంధువులకు మైండ్ బ్లాక్ అయ్యింది.

Dowry Incident : ఇదేందయ్యా ఇది ఏడా సూడలె.. ఎదురు కట్నం సరిపోలేదని పెళ్లికి నో చెప్పిన వధువు, షాక్‌లో వరుడు

Updated On : March 10, 2023 / 7:07 PM IST

Dowry Incident : అడిగినంత కట్నం ఇవ్వలేదనో, కట్నం తక్కువ అయ్యిందనో పెళ్లికి వరుడు నో చెప్పిన ఘటనలు అనేకం జరిగాయి. చివరి నిమిషంలో పెళ్లి కొడుకో లేదా పెళ్లి కొడుకు తల్లిదండ్రులో కట్నం విషయంలో అలిగి పెళ్లి రద్దు చేస్తుంటారు. ఇలా చాలా చోట్ల జరిగింది. ఇది కామన్. ఇందులో పెద్ద వింతేమీ లేదు. కానీ, ఎదురు కట్నం సరిపోలేదని పెళ్లి కూతురే పెళ్లికి నో చెప్పిందంటే నమ్ముతారా? నమ్మబుద్ధి కావడం లేదు కదూ.

కానీ, అక్కడ అదే జరిగింది. పెళ్లి కూతురు.. పెళ్లి కొడుక్కి, అతడి బంధువులకు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. కాసేపట్లో పెళ్లి అనగా.. సరిగ్గా తాళి కట్టే ముహూర్తం సమయానికి వధువు పెళ్లికి నో చెప్పింది. పెళ్లిని క్యాన్సిల్ చేసింది. ఎదరు కట్నం సరిపోదు, నాకీ పెళ్లి ఇష్టం లేదని తేల్చి చెప్పేసింది. దీంతో వరుడు, అతడి బంధువులకు మైండ్ బ్లాక్ అయ్యింది.

Also Read..Bhadradri Kothagudem: ఇద్దరమ్మాయిలతో.. ఇద్దర్ని ఒకే ముహూర్తంలో పెళ్లాడిన యువకుడు ..

మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ లో ఈ ఘటన జరిగింది. పోచారం మున్సిపాలిటీ పరిధిలోని ఓ కాలనీకి చెందిన యువకుడికి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వరావుపేటకు చెందిన యువతితో పెద్దలు వివాహం నిశ్చయించారు. అబ్బాయి తరపు వారు అమ్మాయికి రూ.2లక్షలు ఎదురు కట్నం ఇచ్చేలా కుల పెద్దల సమక్షంలో ఇరు కుటుంబాల మధ్య అంగీకారం కుదిరింది.

నిన్న రాత్రి పెళ్లికి ముహూర్తం నిర్ణయించారు. అబ్బాయి కుటుంబసభ్యులు ఘట్ కేసర్ లోని ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్లి జరుగుతుందని వెడ్డింగ్ కార్డ్స్ పంపిణీ చేశారు. ముహూర్తానికి ముందే వరుడు, అతడి కుటుంబసభ్యులు, బంధువులు కల్యాణ మండపానికి చేరుకున్నారు. ముహూర్తానికి సమయం అవుతున్నా.. పెళ్లి కూతురు, ఆమె కుటుంబసభ్యులు కల్యాణ మండపానికి రాలేదు. దీంతో వరుడు కుటుంబానికి టెన్షన్ పట్టుకుంది. ఏం జరిగిందో తెలియక ఆందోళనలో మునిగిపోయారు. ఫోన్ చేసిన ఎవరూ స్పందించలేదు.

Also Read..Marriage Cancel: వధువు ముఖానికి వెరైటీ మేకప్.. పెళ్లివద్దంటూ వెళ్లిపోయిన వరుడు

ఏం జరిగిందోనని ఆరా తీయగా.. అబ్బాయి తరపు వారిచ్చే ఎదురు కట్నం చాలదని, అదనంగా కావాలని వధువు డిమాండ్ చేసింది. వివాహ సమయానికి గంట ముందు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పింది. దీంతో వరుడు కుటుంబసభ్యులు నివ్వెరపోయారు. కాసేపు షాక్ లో ఉండిపోయారు. ఆ తర్వాత తేరుకుని న్యాయం చేయాలని కోరుతూ పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు.. అమ్మాయి కుటుంబసభ్యులను పోలీస్ స్టేషన్ కు రప్పించారు. తొలుత ఇచ్చిన రూ.2లక్షలను సైతం అబ్బాయి కుటుంబసభ్యులు వదులుకున్నారు. తర్వాత ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

పెళ్లిళ్లలో కట్నం అంశం కొన్ని సందర్భాల్లో వివాదానికి దారితీస్తోంది. కట్నం ఇవ్వలేదనో, అదనపు కట్నం కావాలనో వరుడి కుటుంబసభ్యులు పెళ్లిళ్లు ఆపిన ఘటనలు అనేకం విన్నాం, కొన్ని కళ్లారా చూశాము కూడా. కానీ, ఇక్కడ సీన్ రివర్స్ కావడం విస్మయానికి గురిచేసే అంశం. పెళ్లి కొడుకు వారిచ్చిన ఎదురుకట్నం తక్కువ అయ్యిందని.. ముహూర్త సమయానికి సరిగ్గా గంట ముందు వధువు పెళ్లికి నిరాకరించింది. వరుడు తరపు వారు ఎంత సర్ది చెప్పాలని చూసినా లాభం లేకపోయింది. పెళ్లి చేసుకునేది లేదని వధువు తెగేసి చెప్పింది. దీంతో చేసేదేమీ లేక వరుడు తరపు వారు ఉసురుమంటూ పెళ్లిని రద్దు చేసుకున్నారు.

Also Read..Wedding Insurance: పెళ్లి క్యాన్సిల్ అయిందా?రూ.10 లక్షలు పరిహారం ఇస్తామంటున్న ఇన్సూరెన్స్ కంపెనీలు..

వివాహానికి వచ్చిన బంధుమిత్రులతో కల్యాణ మండపం కళకళలాడుతోంది. తలంబ్రాలు, పట్టుబట్టలు, కాళ్లకు మెట్టెలు.. అన్నీ సిద్ధం చేశారు. వధువుకు వడి బియ్యం కూడా రెడీ అయ్యాయి. బాజా, భజంత్రీలు అంతా వేదిక దగ్గరే ఉన్నారు. అతిథులకు పసందైన విందు భోజనం కూడా రెడీ చేసి ఉంచారు. కాసేపట్లో పెళ్లి జరగాల్సి ఉంది. కానీ, ముహూర్త సమయానికి వధువు దిమ్మతిరిగే షాక్ ఇచ్చింది. పెళ్లి కొడుకు తరపు వారిచ్చే ఎదురు కట్నం సరిపోలేదని పెళ్లి క్యాన్సిల్ చేసింది పెళ్లి కూతురు. ఇప్పుడీ ఘటన స్థానికంగానే కాదు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ విషయం తెలిసిన వారంతా నోరెళ్ల బెడుతున్నారు. కలికాలం అంటే ఇదేనేమో అని నిట్టూరుస్తున్నారు.