వాహనదారులు బీ కేర్‌ఫుల్.. హైదరాబాద్‌లో ఇక నుంచి డే టైమ్‌లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పట్టుబడితే అంతే సంగతులు

హైద్రాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో ఇక నుంచి మధ్యాహ్నం వేళల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు.

వాహనదారులు బీ కేర్‌ఫుల్.. హైదరాబాద్‌లో ఇక నుంచి డే టైమ్‌లో కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.. పట్టుబడితే అంతే సంగతులు

Drink and Drive Checks

Updated On : July 17, 2025 / 1:50 PM IST

Hyderabad Drink and Drive Checkings : డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు మధ్యాహ్నం సమయంలో ఉండవని మద్యం సేవించి వాహనాలు నడిపే వాహనదారులూ బీ కేర్‌ఫుల్. ఇకనుంచి మీ ఆటలు సాగవ్. మందేసి వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు కారణమయ్యే వాహనదారుల పనిపట్టేందుకు హైదరాబాద్ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై పగటి పూట కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే తాజాగా.. హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ఆధ్వర్యంలో డే టైమ్‌లో సర్ప్రైజ్ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయెల్ డేవిస్ మాట్లాడుతూ కీలక విషయాలు వెల్లడించారు.

హైద్రాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసుల ఆధ్వర్యంలో సర్ప్రైజ్ డే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టడం జరిగింది. డ్రంక్ అండ్ డ్రైవ్ అంటే వీకెండ్స్ నైట్ మాత్రమే చేస్తారనే భావనలో కొందరు వాహనదారులు ఉన్నారు. ట్రాఫిక్ కంజేషన్ ఉంటుందని నైట్ టైం చేస్తాం. జూన్ నెలల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహిస్తున్న క్రమంలో స్కూల్ బస్ డ్రైవర్‌లు మద్యం సేవించి పట్టుబడ్డారు. 35 మంది స్కూల్ బస్ డ్రైవర్లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో దొరకడం షాక్‌కి గురి చేసింది. బస్, వ్యాన్, ఆటో డ్రైవర్లు ఉదయం వేళలో మద్యం సేవించి వాహనాలు నడుపుతునట్లు గుర్తించాం. అందుకే ఉదయం కూడా కొన్ని ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేయాలని నిర్ణయించామని సీపీ జోయెల్ డేవిస్ చెప్పారు.

ట్రాఫిక్ జామ్ ఇబ్బందులు లేకుండా ఈ సర్పైజ్ డే డ్రంక్ ఎండ్ డ్రైవ్ తనిఖీలు చేస్తున్నాము. మైనర్‌లు డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడితే కట్టిన చర్యలు తీసుకుంటున్నాం. మైనర్ డ్రైవింగ్‌పై స్పెషల్ ఫోకస్ పెట్టాం. 4500 మైనర్ డ్రైవింగ్ కేసులు నమోదు చేశాము. 2,800 వాహనాల వెహికిల్ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ కోసం ట్రాన్స్‌పోర్టు అధికారులకు సమాచారం ఇచ్చాం. 863 వెహికిల్స్ రిజిస్ట్రేషన్ క్యాన్సల్ చేశాం. మైనర్ డ్రైవింగ్‌లో పట్టుబడితే 25 ఏండ్ల వరకు డ్రైవింగ్ లైసెన్స్ రాకుండా చర్యలు తీసుకుంటున్నామని సీపీ జోయెల్ తెలిపారు. మద్యం సేవించి వాహనాలు నడపడం ద్వారా వారి ప్రాణాలు కాకుండా ఎదుటి వారి ప్రాణాలకు ముప్పు.. మద్యం సేవించి వాహనాలు నడపొద్దని ట్రాఫిక్ పోలీసుల నుంచి సూచిస్తున్నామని అన్నారు.

ఇదిలాఉంటే.. మొదటి రోజు డే టైమ్ డ్రంక్ అండ్ డ్రైవ్‌లో మద్యం సేవించి వాహనం నడుపుతూ పట్టుబడిన ఓ వ్యక్తి బండిని పోలీసులు సీజ్ చేశారు.