Huzurabad By Poll : కరీంనగర్ బయలుదేరిన ఈటల, బండి

ఎంతో ఉత్కంఠగా రేపిన హుజూరాబాద్ ఉపఎన్నికల తుది ఫలితం మరికొద్ది నిమిషాల్లో తేలనుంది. ఇక ఇప్పటికే ఈటెల గెలుపు ఖాయమైనట్లు తెలుస్తోంది.

Huzurabad By Poll : కరీంనగర్ బయలుదేరిన ఈటల, బండి

Huzurabad By Poll

Updated On : November 2, 2021 / 6:05 PM IST

Huzurabad By Poll : ఎంతో ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉపఎన్నికల తుది ఫలితం మరికొద్ది నిమిషాల్లో తేలనుంది. ఇక ఇప్పటికే ఈటల గెలుపు ఖాయమైనట్లు తెలుస్తోంది. 20 వేల పైచిలుకు ఓట్ల మెజారితో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. బీజేపీ మెజారిటీ కనబర్చడంతో పార్టీ శ్రేణులు సంబురాలు చేసుకుంటున్నారు. నాంపల్లి బీజేపీ కార్యాలయం వద్ద జరిగిన వేడుకల్లో పాల్గొన్న బండి సంజయ్.. అనంతరం కరీంనగర్ బయలుదేరారు.

చదవండి : Huzurabad : బండి సంజయ్‌‌కు అమిత్ షా ఫోన్

ఇక హుజూరాబాద్ నుంచి ఈటల రాజేందర్, ఆయన సతీమణి జమున కరీంనగర్ బయలుదేరారు. విజయం అనంతరం ఇక్కడ మీడియాతో మాట్లాడనున్నారు. హుజూరాబాద్‌లో విజయోత్సవ వేడుకలపై ఎన్నికల కమిషన్ నిషేధం విధించడంతో కరీంనగర్ పయనమయ్యారు బీజేపీ నేతలు.

చదవండి : Huzurabad By Poll : 13వ రౌండ్‌‌లో ఈటల ముందంజ…ఏ రౌండ్‌‌లో ఎన్ని ఓట్లు