విద్యుత్‌ శాఖ అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్

  • Published By: sreehari ,Published On : October 14, 2020 / 10:04 PM IST
విద్యుత్‌ శాఖ అప్రమత్తంగా ఉండాలి : కేసీఆర్

Updated On : October 14, 2020 / 10:12 PM IST

CM KCR : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని సీఎం కేసీఆర్ చెప్పారు. విద్యుత్ శాఖను కూడా విద్యుత్ విషయంలో ప్రజలను అప్రమత్తం చేయాలని సూచించారు.

ట్రాన్స్‌కో సీఎండీ ఎండీ దేవులపల్లి ప్రభాకర్‌రావుతో విద్యుత్‌శాఖ పరిస్థితిపై కేసీఆర్ సమీక్షించారు. జెన్‌కో, ట్రాన్స్‌కో, డిస్కమ్‌ అధికారులతో నిత్యం పరిస్థితిని సమీక్షించాలని ఆదేశించారు.



అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్యుత్‌ విషయంలో అప్రమత్తంగా ఉండాలని ఎండీని ఆదేశించారు. చాలా చోట్ల విద్యుత్ శాఖకు కూడా భారీ నష్టం జరిగిందని అన్నారు.

విద్యుత్ పునరుద్ధరణ కోసం సిబ్బంది ప్రతికూల వాతావరణంలో కూడా బాగా కష్టపడుతున్నారని కేసీఆర్ ప్రశంసించారు.

వందశాతం పునరుద్ధరణ జరిగే వరకు ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని చెప్పారు. వరద పరిస్థితిపై కేసీఆర్‌కు విద్యుత్‌ సంస్థ సీఎండీ వివరించారు.

రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు, వరదల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు.



వరదలో పెద్ద సంఖ్యలో ట్రాన్స్‌ఫార్మర్లు కొట్టుకుపోయాయని, స్తంభాలు దెబ్బతిన్నాయని, వైర్లు తెగిపోయాయని పేర్కొన్నారు. వానలు, వరదల ఉధృతి తగ్గలేదని, వరద ప్రాంతాలకు సిబ్బంది వెళ్లడం కష్టంగా ఉందన్నారు.

హైదరాబాద్‌తో పాటు చాలా పట్టణాల్లో అపార్ట్‌మెంట్లు నీటితో నిండి పోయాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగిందన్నారు.

కొన్ని చోట్ల విద్యుత్ ప్రమాదాలు నివారించడానికి ముందు జాగ్రత్త చర్యగా సరఫరాను నిలిపివేశారన్నారు.



ఈ పరిస్థితిని బట్టి మళ్లీ విద్యుత్‌ సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఎక్కడి వరకు సిబ్బంది చేరుకున్నారో 24 గంటల పాటు పునరుద్ధరణ పనులు చేపడుతున్నట్లు వివరించారు.