Epuri Somanna : ఎవరితో యుద్ధం చేస్తున్నానో తెలుసు..పెద్ద కొండను ఢీ కొంటున్నాం – షర్మిల, ఏపూరి సోమన్న ఆట, పాట..

నేను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తెలుసని, చాలా పెద్ద కొండను ఢీ కొంటున్నామని తనకు తెలుసన్నారు షర్మిల.

Epuri Somanna : ఎవరితో యుద్ధం చేస్తున్నానో తెలుసు..పెద్ద కొండను ఢీ కొంటున్నాం – షర్మిల, ఏపూరి సోమన్న ఆట, పాట..

Sharmila (1)

Updated On : March 15, 2021 / 6:15 PM IST

YS Sharmila Party : తెలంగాణ రాష్ట్రంలో పార్టీ పెట్టాలని అనుకుంటున్న దివంగత సీఎం రాజశేఖరరెడ్డి కుమార్తె వైఎస్ షర్మిల వేగంగా అడుగులు వేస్తున్నారు. వివిధ జిల్లాలకు చెందిన నేతలు, వైఎస్ అభిమానులు, ఇతరులతో వరుస భేటీలు నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా..పలువురు షర్మిలకు మద్దతు తెలియచేస్తున్నారు. పార్టీలో చేరేందుకు పలువురు ఆసక్తి కనబరుస్తున్నారు. తాజాగా..ప్రజాకవి ఏపూరి సోమన్న షర్మిలతో 2021, మార్చి 15వ తేదీ సోమవారం భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. షర్మిల ఏర్పాటు చేయబోయే పార్టీలో ఆయన చేరుతారని గత కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఆయన కాంగ్రెస్ పార్టీ లీడర్ గా ఉన్నారు. షర్మిలతో కలిసి ఆయన ప్రసంగించారు. ఈ సందర్భంగా పాటలతో అలరించారు.

ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ…

నేను ఎవరితో యుద్ధం చేస్తున్నానో తెలుసని, చాలా పెద్ద కొండను ఢీ కొంటున్నామని తనకు తెలుసన్నారు. తెలంగాణ ప్రయోజనాల గురించి ఆలోచించే పాలన కావాలని ఆకాంక్షించారు. ఈ యుద్ధంలో తమ్ముడు ఏపూరి సోమన్న మద్దతుగా నిలపడం సంతోషంగా ఉందన్నారు. జాన పదానికి, గజ్జె కట్టిన ప్రతొక్కరికీ వందనం చెప్పారు. వైఎస్ రాజశేఖరరెడ్డి బిడ్డగా పుట్టడం తన అదృష్టమన్నారు వైఎస్ షర్మిల.