సా.6 గం.ల తర్వాత బయటి నుంచి వచ్చిన నేతలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలి : సీపీ

  • Published By: bheemraj ,Published On : November 29, 2020 / 05:32 PM IST
సా.6 గం.ల తర్వాత బయటి నుంచి వచ్చిన నేతలు హైదరాబాద్ నుంచి వెళ్లిపోవాలి : సీపీ

Updated On : November 29, 2020 / 6:07 PM IST

ghmc elections strong security : నేటి సాయంత్రం 6 గంటలకు జీహెచ్ఎంసీ ఎన్నికల ప్రచారం ముగుస్తుందని సీపీ అంజనీకుమార్ అన్నారు. సాయంత్రం 6 గంటల తర్వాత బయటి నుంచి వచ్చిన నేతలు నగరం నుంచి వెళ్లిపోవాలని తెలిపారు.



బల్దియా ఎన్నికలకు 22 వేల మంది పోలీసులతో పటిష్ట భద్రత ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. పోలీసు సిబ్బందికి నాలుగు సార్లు తర్ఫీదు ఇచ్చామని చెప్పారు.



కేంద్ర, రాష్ట్ర బలగాలు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల వద్ద సీఐ స్థాయి అధికారి నేతృత్వంలో భద్రత ఏర్పాటుచ చేశామని చెప్పారు. ఎలక్ట్రానిక్ ప్లాట్ ఫామ్ ద్వారా భద్రత కట్టుదిట్టం చేశామని చెప్పారు.



జియో ట్యాగింగ్ ద్వారా పోలింగ్ కేంద్రాలను అనుసంధానం చేశామని తెలిపారు. 4 లక్షల సీసీ కెమెరాల ద్వారా మానిటరింగ్ చేస్తున్నామని చెప్పారు. డీసీపీ, ఏసీపీ ఆఫీస్ లలో 24 గంటలపాటు పర్యవేక్షణ ఉంటుందన్నారు. స్ట్రాంగ్ రూములు వద్ద నిఘా ఉంచామని తెలిపారు.



3,067 రౌడీ షీటర్లను బైండోవర్ చేశామని చెప్పారు. నగర ప్రజలు నిర్భయంగా ఓటు వేయాలన్నారు. ఎన్నికల ఏజెంట్ కు ప్రత్యేక వాహనానికి అనుమతి ఉండదన్నారు. ఓటర్లను తరలించడం చట్ట విరుద్ధం..అలా చేస్తే వాహనాలు సీజ్ చేస్తామని హెచ్చరించారు.



ఇప్పటివరకు రూ.1.45 కోట్లు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. రూ.10 లక్షల విలువైన మత్తు పదార్ధాలు, మద్యం స్వాధీనం చేసుకున్నామని చెప్పారు.

63 ఫిర్యాదుల్లో 55 ఎఫ్ ఐఆర్ లు నమోదు చేశామని తెలిపారు. సోషల్ మీడియాపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు.