Etala Rajender: ఈటల రాజేందర్ పాదయాత్ర మొదలు

Etala Rajender Bjp
Etala Rajender: టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ పాదయాత్ర సోమవారం ఉదయం 9గంటల 30నిమిషాలకు ఆరంభం కానుంది. కమలాపూర్ మండలం బత్తినివాని పల్లి నుంచి మొదలుకానున్నారు. ముందుగా బత్తినివానీపల్లిలోని ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
శనిగరం, మాదన్నపేట, గునిపర్తి, శ్రీరాముల పేట, అంబల ప్రాంతాలలో పాదయాత్ర
నిర్వహించాలని ప్లాన్ చేశారు. మంగళవారం రాత్రి అంబాలలో ఉండనున్నారు.
23 రోజుల పాటు జరగనున్న పాదయాత్రలో
107 గ్రామపంచాయితీల పరిధిలోని 127 గ్రామాల్లో 270 కిలోమీటర్ల దూరం వెళ్లాలని ప్లాన్ చేశారు.