KCR : మాజీ సీఎం కేసీఆర్‌కు అనారోగ్యం.. ఆస్పత్రిలో పరీక్షలు..
కేసీఆర్ కు డాక్టర్లు పలు వైద్య పరీక్షలు నిర్వహించారు.

KCR
KCR : తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అనారోగ్యం పాలయ్యారు. ఆయన సీజనల్ జ్వరంతో బాధపడుతున్నారని తెలుస్తోంది. కేసీఆర్ సోమాజిగూడ యశోద ఆస్పత్రికి వెళ్లారు. అక్కడ సాధారణ వైద్య పరీక్షలు చేయించుకున్నారు. ప్రత్యేక వైద్య బృందం కేసీఆర్ కు పలు మెడికల్ టెస్టులు చేసింది. ఇది కేవలం రెగ్యులర్ హెల్త్ చెకప్ లో భాగమేనని డాక్టర్లు తెలిపారు. కాగా, కేసీఆర్ కు అనారోగ్యం అని తెలియగానే బీఆర్ఎస్ శ్రేణులు కొంత ఆందోళనకు గురయ్యాయి. కేసీఆర్ ఆరోగ్యం గురించి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆరా తీశారు.