E Car Race Case : మంత్రిగా నేనే నిర్ణయం తీసుకున్నా- కేటీఆర్
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

E Car Race Case : ఈ కార్ రేసులో మంత్రిగా తానే నిర్ణయం తీసుకున్నానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈడీ నుంచి నోటీసులు అందాయని ఆయన స్పష్టం చేశారు. మనీనే లేని చోట మనీ లాండరింగ్ ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు. ఈ కేసులో ప్రభుత్వంపై న్యాయ పోరాటం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బీజేపీ ఎంపీలు రక్షణ కవచంగా పని చేస్తున్నారని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం లూటీకి కేంద్రం సహకరిస్తోందన్నారు. అమృత్ స్కామ్, సివిల్ సప్లయ్ అవినీతిపై నోరు ఎందుకు విప్పలేడం నిలదీశారు కేటీఆర్. ఈ కార్ రేసులో మంత్రిగా తానే నిర్ణయం తీసుకున్నానని కేటీఆర్ చెప్పారు. 2025లో బీఆర్ఎస్ పార్టీ కొత్త అధ్యక్షుడిని ఎన్నుకంటామన్నారు. అలాగే పార్టీ కొత్త కమిటీలను ఏర్పాటు చేస్తామని తెలిపారు.
Also Read : ఆ మూడు సీట్లలో పోరు అంటేనే కదలని కారు.. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఫైట్‌కు బీఆర్ఎస్ దూరం?