Ponguleti TRS : కాంగ్రెస్, బీజేపీ వాళ్లు టచ్‌లో ఉన్నారు – పొంగులేటి

వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పును వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం గులాబీ తోటలోనే ఉన్నా.. ఎన్ని ముళ్లు గుచ్చుకున్నా..

Ponguleti TRS : కాంగ్రెస్, బీజేపీ వాళ్లు టచ్‌లో ఉన్నారు – పొంగులేటి

Ponguleti Trs

Updated On : March 10, 2022 / 7:21 PM IST

Ponguleti TRS : ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం పర్యటనలో మాజీ ఎంపీ పొంగులేటి సుధాకర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ప్రజా తీర్పును వదులుకునే ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు. ప్రస్తుతం గులాబీ తోటలోనే ఉన్నా.. ఎన్ని ముళ్లు గుచ్చుకున్నా ఇందులోనే ఉంటానని ఆయన అన్నారు.

ఇప్పటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ కానీ కేటీఆర్ కానీ ఈ ప్రాంతంలో పోటీ చేయాలనే ఆదేశాలు ఇవ్వలేదన్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ అధినాయకత్వం నన్ను సంప్రదిస్తూనే ఉన్నారని తెలిపారు. ఎంపీగా ఉన్నప్పుడు ప్రజల మధ్యలో ఉన్నా, పదవి పోయిన తర్వాత కూడా ప్రజల మధ్యలోనే ఉన్నా అని అన్నారు. టీఆర్ఎస్ పార్టీ నాకు అవకాశం ఇస్తుందని ఆశిస్తున్నా అన్న పొంగులేటి.. ఒకవేళ ఇవ్వకపోయినా ప్రజాక్షేత్రంలోకి వెళ్లడం ఖాయం అని చెప్పారు. అంతిమంగా ప్రజలే తీర్పు ఇస్తారని అన్నారు.