Rachakonda Police: కొరియర్‌లో పేలుడు పదార్థాలు కలకలం: అప్రమత్తమైన రాచకొండ పోలీసులు

హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో గురువారం పేలుడు పదార్థాలు కలకలం రేగింది.

Rachakonda Police: కొరియర్‌లో పేలుడు పదార్థాలు కలకలం: అప్రమత్తమైన రాచకొండ పోలీసులు

Explosives

Updated On : March 17, 2022 / 9:11 PM IST

Rachakonda Police: హైదరాబాద్ రాచకొండ కమిషనరేట్ పరిధిలోని వనస్థలిపురంలో గురువారం పేలుడు పదార్థాలు కలకలం రేగింది. పోలీసులు తెలిపిన వివరాలు మేరకు..వనస్థలిపురంలోని నవతా ట్రాన్స్‌పోర్టులో ఇటీవల వచ్చిన ఓ కొరియర్‌ పార్సెల్ లో పేలుడు పదార్థాలు ఉన్నాయి. 8 కార్టన్లలో పేలుడు పదార్థాలు చిలకలూరిపేట నుంచి పుణెకు పార్సిల్‌ చేయబడ్డాయి. ఈక్రమంలో మార్చి 15న హైదరాబాద్‌కు ఈ కొరియర్‌ చేరుకోగా ట్రాన్స్‌పోర్టు సిబ్బంది సాధారణ తనిఖీల్లో భాగంగా గురువారం వాటిని పరిశీలించారు.

Also Read: Child Safe : విశాఖలో కిడ్నాపైన పాప క్షేమం- శ్రీకాకుళంలో ఆచూకీ లభ్యం

8 కార్టన్లలో పేలుడు పదార్థాలు ఉన్నట్లు గుర్తించిన సిబ్బంది వెంటనే స్థానిక పోలీసులకు సమాచారమిచ్చారు. హుటాహుటిన అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ పేలుడు పదార్థాలు సినిమాల్లో వాడే బాంబులుగా నిర్ధారించారు. మొత్తం 8 కార్టన్లలో సుమారు 100 బాంబులు గుర్తించిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పేలుడు పదార్ధాలు తరలింపుకు లైసెన్స్ ఉందా? ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు? ఎవరి పేరుపై ఉన్నాయి? అనే విషయాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Also Read: Tamil Nadu : బైక్ నెంబ‌ర్ ప్లేట్‌పై ‘ఎమ్మెల్యే మ‌న‌వ‌డిని’ అని రాయించుకుని దర్జాగా తిరిగేస్తున్నా..ఎంత బలుపు?!