గర్భిణీకి అబార్షన్, ఎలాంటి సామాగ్రీ లేకుండానే..ప్రాణం తీసిన నకిలీ ఆర్ఎంపీ

pregnant woman Mahabubabad ఫ మహబూబాబాద్ జిల్లా అబార్షన్లకు అడ్డగా మారి ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. నెల్లికుదురు మండలం వావిలాల గ్రామానికి సమీపంలోని బోటిమీది తండాలో ఆలస్యంగా వెలుగు చేసిన అబార్షన్ సంచలనం సృష్టించగా.. ఈ ఘటనలో బాధిత మహిళ ప్రాణాలు విడిచింది. బోటిమీది తండా ఉప సర్పంచ్ సంతోష్.. నకిలీ ఆర్ఎంపీగా మారి ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం 8 నెలల గర్భిణికి సంతోష్ పశువుల పాకలో అబార్షన్ చేశాడు. ఎలాంటి ఆపరేషన్ సామాగ్రి లేకుండా ఆపరేషన్ నిర్వహించడంతో మహిళ తీవ్ర రక్త స్రావానికి గురయ్యింది.
ఆమె అపస్మారక స్థితికి వెళ్లడంతో వెంటనే అక్కడి నుంచి కుటుంబ సభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ బాధిత మహిళ ప్రాణాలు విడిచింది. మహిళ మరణించడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. సంతోష్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడంతో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అయితే సంతోష్ ఆగడాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. గతంలో అతను ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పని చేసేవాడు. అక్కడ ఓ లేడీ నర్సుతో పరిచయం కావడంతో గుట్టు చప్పుడు కాకుండా ఆబార్షన్లు నిర్వహించే వారు. అయితే విషయం బయటకు పొక్కడంతో వారు అక్కడి నుంచి మకాం మార్చి.. బోటి మీది తండాలోనే దందాను మొదలు పెట్టారు. డబ్బులకు ఆశపడి మొత్తం ఐదుగురు సభ్యులతో కూడిన ముఠా ఈ అబార్షన్ల తంతు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది.