Falak Numa Express Incident : ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు ఘటన.. బోగిలోని విద్యుత్ తీగల లోపాల వల్లే ప్రమాదం!

కరెంటు తీగల లోపాల వల్లే ప్రమాదం సంభవించిందని నిర్ధారించారు. ఆధారాలన్నింటిని అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు అందిస్తామని అధికారులు తెలిపారు.

Falak Numa Express Incident : ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు ఘటన.. బోగిలోని విద్యుత్ తీగల లోపాల వల్లే ప్రమాదం!

Falak Numa Express Incident

Updated On : July 8, 2023 / 9:48 PM IST

Clues Team Investigation : యాదాద్రి జిల్లా భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో భారీ అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాదం వద్ద క్లూస్ టీం విచారణ ముగిసింది. రైలు ప్రమాదానికి సంబంధించి ఆధారాలను క్లూస్ టీం సేకరించింది. ఎస్-4లోని బాత్రూమ్ వద్ద ముందుగా పొగలు వ్యాపించాయని నిర్ధారణ చేసింది. బోగిలోని విద్యుత్ తీగల లోపాల వల్లే ప్రమాదం సంభవించినట్లుగా గుర్తించారు. ఎస్-4 భోగిలోని మంటలు ఇతర భోగిలకు వ్యాపించాయని నిర్ధారణ చేశారు.

కరెంటు తీగల లోపాల వల్లే ప్రమాదం సంభవించిందని నిర్ధారించారు. ఆధారాలన్నింటిని అధికారులు ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాతే పూర్తి వివరాలు అందిస్తామని అధికారులు తెలిపారు. మరోవైపు భువనగిరి హౌరా – సికింద్రాబాద్ ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలు ప్రమాద ఘటనపై హై లెవెల్ కమిటీ ఎంక్వైరీ కొనసాగుతోంది. బొమ్మాయి పల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాదం గురించి తెలిసిన వారుంటే తమకు తెలియ జేయాలని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది.

Falaknuma Express: ఫలక్‭నామా ఎక్స్‭ప్రెస్‭లో భారీ అగ్ని ప్రమాదం.. కాలిబూడిదైన రైలు బోగీలు

ప్రమాదం గురుంచి అనుమానం, సాక్ష్యాలున్న వారు హైదరాబాద్ సంచాలన్ భవన్ కు రావాలని సూచించారు. జూలై 10, 11 తేదీల్లో రైల్వే సంచాలన్ భవన్ కు వచ్చి వివరాలు తెలపవచ్చని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. భువనగిరి రైల్వే స్టేషన్ సమీపంలో ఫలక్ నుమా రైలులో భారీ అగ్నిప్రమాదం జరిగింది. రైలు భోగీల నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.

కాగా, కొంతమంది ప్రయాణికులకు మాత్రం స్పల్పంగా గాయాలైనట్లు తెలుస్తోంది. సమాచారం అందిన వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఫైర్ ఇంజన్లతో మంటలను ఆర్పే ప్రయత్నం చేశారు.  బెంగాల్ నుండి సికింద్రాబాద్ వెళ్తోన్న ఫలక్ నుమా ఎక్స్ ప్రెస్ రైలులో భువనగిరి మండలం బొమ్మాయిపల్లి-పగిడిపల్లి మధ్యలో పొగలు కనిపించాయి. రెండు బోగీలు పూర్తిగా మంటల్లో చిక్కుకున్నాయి. రైలు నుంచి పెద్ద ఎత్తున దట్టమైన పొగలు అలుముకున్నాయి.

Falaknuma Express: ఫలక్‭నామా ఎక్స్‭ప్రెస్ రైలు ప్రమాదం ముందుగా ప్లాన్ చేసిందా? కలకలం సృష్టిస్తున్న అగంతకుడి లేఖ

మొత్తం ఎస్ 4, ఎస్5, ఎస్6, ఎస్7 అనే నాలుగు బోగీలు ప్రమాదంలో చిక్కుకున్నాయి. మొదట రాగానే లోకో పైలెట్ గమనించి రైలుని నిలిపివేశారు. రైల్వే సిబ్బంది వెంటనే ప్రయాణికులను కిందికి దించేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. అగ్నిప్రమాదానికి గురైన బోగీలను సిబ్బంది రైలు నుంచి విడదీశారు. నాలుగు బోగీలను అక్కడే వదిలేసి మిగిలిని బోగీలతో రైలును సికింద్రాబాద్ కు పంపించారు.