Covid-19: విషాదం.. కరోనాతో తండ్రి కొడుకుల మృతి
జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకిన తండ్రికి సేవ చేసేందుకు విదేశాల నుంచి వచ్చిన కుమారుడు.. కరోనాతో మృతి చెందాడు. ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Covid 19 (6)
Covid-19: జగిత్యాల జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కరోనా సోకిన తండ్రికి సేవ చేసేందుకు విదేశాల నుంచి వచ్చిన కుమారుడు.. కరోనాతో మృతి చెందాడు. ధర్మపురి మండలం కొసునూరుపల్లెలో ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. . కొసునూరుపల్లెకు చెందిన ఉట్కూరు హన్మంతరెడ్డి (75) గత నెల 7వ తేదీన కరోనా బారినపడ్డారు. ఈ నేపథ్యంలోనే తండ్రికి సేవలు చేసేందుకు సింగపూర్ నుంచి కుమారుడు గంగిరెడ్డి స్వగ్రామానికి వచ్చాడు.
కరోనా సోకిన తండ్రికి అన్ని తానై దగ్గరుండి చూసుకున్నాడు.. ఈ క్రమంలోనే గంగిరెడ్డి కరోనా బారినపడ్డారు. ఇదే సమయంలో తండ్రి ఆరోగ్యపరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్పించారు. హన్మంతురెడ్డి చికిత్స పొందుతూ మే 15న మృతి చెందాడు. తండ్రి మృతి తర్వాత గంగిరెడ్డి ఆరోగ్యపరిస్థితి కూడా విషమించడంతో హైదరాబాద్ లోనే ఓ ఆసుపత్రిలో చేరాడు.
చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. 20 రోజుల వ్యవధిలోనే తండ్రి కొడుకు మృతి చెందడంతో బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తండ్రికి సేవ చేసేందుకు వచ్చి కుమారుడు కూడా మృతి చెందటంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.