బడ్జెట్ తయారీకి సిధ్ధమవుతున్న ఆర్ధికశాఖ

  • Published By: chvmurthy ,Published On : January 4, 2019 / 10:22 AM IST
బడ్జెట్ తయారీకి సిధ్ధమవుతున్న ఆర్ధికశాఖ

హైదరాబాద్: 2019-20 ఆర్ధిక సంవత్సరానికిగాను రాష్ట్ర బడ్జెట్ తయారుచేసే పనిలో ఆర్ధికశాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఈ నెల 11 వ తేదీలోగా ప్రతిపాదనలు పంపించాలని అన్నిశాఖల అధికారులను ఆదేశించారు. 2018-19 కి సవరణ బడ్జెట్, 2019-20 కి బడ్జెట్ అంచనాలు పంపాలని ఆర్ధికశాఖ అధికారులు కోరారు. ప్రతిపాదనలు ఆన్ లైన్ లోనే పంపాలని ఆర్ధికశాఖ సూచించింది.