Akhanda Movie : అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో అగ్నిప్రమాదం

నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. అఖండ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో అగ్నిప్రమాదం జరిగింది.

Akhanda Movie : అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో అగ్నిప్రమాదం

Akhanda Movie (2)

Updated On : December 2, 2021 / 3:30 PM IST

Akhanda Movie : నందమూరి బాలకృష్ణ నటించిన అఖండ సినిమా ఈ రోజు రిలీజ్ అయిన విషయం తెలిసిందే. బాలకృష్ణ అభిమానులతో థియేటర్లు నిండిపోయాయి. ఇక ఈ క్రమంలోనే అఖండ సినిమా ప్రదర్శిస్తున్న ఓ థియేటర్లో అగ్నిప్రమాదం జరిగింది. దీంతో ప్రేక్షకులు థియేటర్లోంచి పరుగులు తీశారు. ఈ ఘటన వరంగల్ లో చోటుచేసుకుంది. పట్టణంలోని జెమిని థియేటర్లో అకస్మాత్తుగా అగ్నిప్రమాదం సంభవించింది.

చదవండి : Akhanda : మా సౌండ్ బాక్సులు బద్ధలవుతున్నాయి.. ‘అఖండ’లో తమన్ వీర కొట్టుడు..

దీనిని గమనించి కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు ప్రేక్షకులు. కొద్దీ క్షణాల్లోనే థియేటర్ మొత్తం పొగలు కమ్ముకున్నాయి. వెంటనే అప్రమత్తమైన థియేటర్‌ యాజమాన్యం అగ్నిమాపక సిబ్బందికి ఫోన్‌ చేశారు. థియేటర్ వద్దకు చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. షార్ట్ సర్క్యూట్ తో థియేటర్లు మంటలు చెలరేగినట్లు పేర్కొంటున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

చదవండి : Akhanda : ఎట్టకేలకు ఏపీలో బెనిఫిట్ షో.. థియేటర్స్‌లో బాలయ్య మానియా