హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో భారీ అగ్నిప్రమాదం

కాంప్లెక్స్ లోని ప్లాస్టిక్ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్‌లో భారీ అగ్నిప్రమాదం

Fire Accident : హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్ లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. శ్రీ దత్తసాయి కమర్షియల్ కాంప్లెక్స్ లో మంటలు చెలరేగాయి. రెండు ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపు చేస్తున్నారు ఫైర్ సిబ్బంది. కాంప్లెక్స్ లోని ప్లాస్టిక్ గోడౌన్ లో అగ్నిప్రమాదం జరిగినట్లుగా పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు.

ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సప్తగిరి థియేటర్ ఎదురుగా ఉన్న దత్తసాయి కాంప్లెక్స్ లో అగ్నిప్రమాదం జరిగింది. భారీగా మంటలు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కాంప్లెక్స్ లోని 3,4 ఫ్లోర్లు ప్లాస్టిక్ ఐటమ్స్ కు సంబంధించిన స్టోరేజ్ రూమ్ గా చెబుతున్నారు. మంటలు చెలరేగడం గుర్తించిన స్థానికులు వెంటనే ఫైర్ ఇంజిన్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఈ కాంప్లెక్స్ చుట్టుపక్కల నివాస సముదాయాలు, కమర్షియల్ కాంప్లెక్స్ లు ఉన్నాయి.

లోపలికి వెళ్లే అవకాశం లేకుండా పోవడంతో మెట్రో స్టేషన్ మెట్ల మీద నిల్చుని మంటలను అదుపు చేసేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలు అదుపులోకి వచ్చినట్లే వచ్చి మళ్లీ చెలరేగాయి. ప్లాస్టిక్ మెటీరియల్ కావడంతో మంటలు మళ్లీ ఎగిసిపడ్డాయని చెబుతున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పెద్ద మొత్తంలో ప్లాస్టిక్ మెటీరియల్ స్టోర్ చేసినట్లుగా తెలుస్తోంది. ప్రాణాపాయం లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. అయితే ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు.

Also Read : సందీప్ కిషన్ రెస్టారెంట్‌లో తనిఖీలు.. వెలుగులోకి విస్తుపోయే నిజాలు