హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి ఐదో అంతస్తులో అగ్ని ప్రమాదం.. రోగుల్లో టెన్షన్

అగ్ని ప్రమాద సమయంలో ఐదవ అంతస్తు అద్దాలను సిబ్బంది పగులగొట్టారు.

హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి ఐదో అంతస్తులో అగ్ని ప్రమాదం.. రోగుల్లో టెన్షన్

Updated On : April 19, 2025 / 5:29 PM IST

హైదరాబాద్‌లోని నిమ్స్ ఆసుపత్రి అత్యవసర విభాగంలోని ఐదో అంతస్తులో అగ్ని ప్రమాదం జరిగింది. ఘటనా స్థలికి ఫైర్ ఇంజిన్లు చేరుకున్నాయి. ఐదవ అంతస్తు నుంచి మంటలు ఎగిసిపడ్డాయి. పొగ వల్ల రోగులు ఇబ్బంది పడ్డారు.

పలువురు రోగులు పరుగులు తీశారు. ఆ అంతస్తుకు విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. రోగులను నిమ్స్ సిబ్బంది షిఫ్ట్ చేస్తున్నారు. ఐదవ అంతస్తు లిఫ్ట్ పక్కన ఉన్న ప్యానల్ బోర్డ్ లో షార్ట్ సర్క్యూట్ కారణంగా అగ్నిప్రమాదం సంభవించినట్లు తెలుస్తోంది.

Also Read: ఎట్టకేలకు ‘దసరా’ సినిమా విలన్ అరెస్ట్.. మొన్ననే హోటల్‌ మూడో అంతస్తు నుంచి దూకి పారిపోయి..

ఐదవ అంతస్తు ఎలక్ట్రికల్ ప్యానెల్ నుంచి దట్టమైన పొగ వెలువడుతోంది. ఆ అంతస్తులో మెడికల్ గ్యాస్ట్రో, సర్జికల్ గ్యాస్ట్రో విభాగాలు ఉంటాయి. పొగలను అగ్నిమాపక సిబ్బంది అదుపులోకి తీసుకువస్తున్నారు. అగ్ని ప్రమాద సమయంలో ఐదవ అంతస్తు అద్దాలను సిబ్బంది పగులగొట్టారు.