Hussain Sagar Fire : హుస్సేన్‌ సాగర్‌లో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. అసలేం జరిగిందంటే..

ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. ఈ ఘటనలో రెండు బోట్లు దగ్దమయ్యాయి.

Hussain Sagar Fire : హుస్సేన్‌ సాగర్‌లో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా చెలరేగిన మంటలు.. అసలేం జరిగిందంటే..

Updated On : January 26, 2025 / 10:47 PM IST

Hussain Sagar Fire : హైదరాబాద్ హుస్సేన్ సాగర్ లో అగ్నిప్రమాదం జరిగింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో రెండు బోట్లు మంటల్లో కాలిపోయాయి. నెక్లెస్ రోడ్ లోని పీపుల్స్ ప్లాజా గ్రౌండ్స్ లో భారతమాత పౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న భారతమాతకు మహా హారతి కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన బాణాసంచా పేల్చే క్రమంలో అపశ్రుతి చోటు చేసుకుంది. క్రాకర్స్ కాల్చే సమయంలో అగ్నిప్రమాదం జరిగింది.

హుస్సేన్ సాగర్ లో రెండు బోట్లలో ఏర్పాటు చేసిన బాణాసంచా ప్రమాదవశాత్తు దగ్ధమైంది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో రెండు బోట్లు దగ్దమయ్యాయి. బోట్లలో క్రాకర్స్ ఉంచి కాల్చేందుకు ప్రయత్నించడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.

Also Read : బాబోయ్.. తల్లిదండ్రులు విడిపోయిన పిల్లల్లో ఈ భయంకరమైన జబ్బు వచ్చే ప్రమాదం ఉందట..!

టపాసులు బోట్లలోనే ఒక్కసారిగా పేలిపోయాయి. బోట్లలో ఉన్న 15మంది సురక్షితంగా బయటపడ్డారు. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు.

భారతమాతకు హారతి కార్యక్రమంలో భాగంగా ట్యాంక్ బండ్ లో భారతమాత విగ్రహం వెనకాల వ్యూ వచ్చే విధంగా ఫైర్ వర్స్స్ ని ఏర్పాటు చేశారు. ఈ ఫైర్ వర్క్స్ 20 నిమిషాల పాటు ఉండే విధంగా ఏర్పాట్లు చేశారు. దానికి సంబంధించిన క్రాకర్స్ ను రెండు బోట్లలో సిద్ధంగా ఉంచారు. క్రాకర్స్ ను సిబ్బంది కాల్చే సమయంలో ఊహించని ప్రమాదం జరిగింది.

మొదటి ఒక నిమిషం కాగానే.. ఫైర్ వర్క్స్ మిస్ ఫైర్ అయ్యింది. అది బోటులోనే పేలిపోయింది. క్రాకర్స్ పేలిపోతుండటం చూసిన సిబ్బంది వెంటనే బోటులో నుంచి హుస్సేన్ సాగర్ లోకి దూకేశారు.

ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరక్కపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. మొత్తం 15 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. కాగా, ఇద్దరికి మాత్రం గాయాలు అయినట్లు తెలుస్తోంది. ఇద్దరు వ్యక్తులకు వారి దుస్తులకు మంటలు అంటుకోగా.. వారు వెంటనే నీళ్లలోకి దూకేయడంతో.. మంటలు ఆరిపోయాయి.

Also Read : మీరు నాకు తెలుసు.. మీకూ ఇలాంటి ఫోన్ కాల్ వచ్చిందా? టెంప్ట్ అయ్యారో ఖతమే..!

ఇంతలో అలర్ట్ అయిన సిబ్బంది స్పీడ్ బోట్లలో అక్కడికి చేరుకుని నీళ్లలోకి దూకిన వారందరిని అక్కడి నుంచి బయటకు తీసుకెళ్లారు. వారిని లుంబినీ పార్క్ దగ్గరికి చేర్చారు. ప్రమాదం గురించి తెలుసుకున్న కేంద్రమంత్రి కిషన్ రెడ్డి.. స్వయంగా వారి వద్దకు వెళ్లారు. అసలు ప్రమాదం జరగడానికి కారణాలు ఏంటో వారిని అడిగి తెలుసుకున్నారు.

ఈ అగ్ని ప్రమాదంలో రెండు బోట్లు పూర్తిగా దగ్దమయ్యాయి. లుంబినీ పార్క్ నుంచి బుద్ధ విగ్రహం వరకు రోజూ టూరిస్టులను తీసుకెళ్లే బోట్లు మంటల్లో పూర్తిగా కాలిపోయాయి.