ఐడియా అదుర్స్ : సినీ తారలను ఈ విధంగా వాడుకున్న రైతన్న

జగిత్యాల జిల్లాలో పంటపొలాల్లో గడ్డి దిష్టి బొమ్మల స్థానంలో వినూత్న ప్రయోగం చేశారు. పంటపొలాల్లో సినీతారల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

  • Published By: veegamteam ,Published On : November 19, 2019 / 03:05 PM IST
ఐడియా అదుర్స్ : సినీ తారలను ఈ విధంగా వాడుకున్న రైతన్న

Updated On : November 19, 2019 / 3:05 PM IST

జగిత్యాల జిల్లాలో పంటపొలాల్లో గడ్డి దిష్టి బొమ్మల స్థానంలో వినూత్న ప్రయోగం చేశారు. పంటపొలాల్లో సినీతారల ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

పూర్వం తమ వ్యవసాయ భూముల్లోని పంటలపై దిష్టి పడకుండా.. పక్షుల తాకిడిని నివారించేందుకు గడ్డితో దిష్టి బొమ్మలు తయారుచేసేవారు. అయితే జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం, ధర్మపురి మండలంలోని పంటపొలాల్లో గడ్డి దిష్టి బొమ్మల స్థానంలో వినూత్న ప్రయోగం చేశారు. పత్తి, మొక్కజొన్న, కూరగాయలు తోటలలో సినీ తారల ఫ్లెక్సీలు ముమైత్ ఖాన్, తమన్నా, కాంచన, ఇతర డెవిల్స్‌ ఫ్లెక్సీలు అమరుస్తున్నారు. 

వ్యవసాయ క్షేత్రాలు రోడ్ల వెంట వెళ్లే వ్యక్తుల దృష్టి సినీ తారల బొమ్మలపై పడుతుండడంతో.. దృష్టి  నివారణ ప్రయోగం విజయవంతమై దిగుబడి పెరిగిందని రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. గతంలో దిగుబడి తగ్గిందని ఈ ప్రయోగంతో తమకు అనుకున్నదానికంటే దిగుబడి అధికంగా వస్తుందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.