VNR Dairy Products : VNR డెయిరీలో ఆకస్మిక సోదాలు.. నాణ్యత లేకుండా పాల ఉత్పత్తుల తయారీ, అధిక మోతాదులో కెమికల్స్ వాడకం
పాల ఉత్పత్తుల తయారీలో మోతాదుకి మించి ప్రోటీన్ బైండర్ వాడినట్లు అధికారులు గుర్తించారు. Raids In VNR Dairy

VNR Dairy Products
Raids In VNR Dairy : నల్గొండ జిల్లా కేతిపల్లి మండలం ఇనుపాములలోని VNR డెయిరీలో ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. భారీగా నిల్వ ఉంచిన ప్రోటీన్ బైండర్, పాల తయారీ ఉత్పత్తులను పరిశీలించారు. డెయిరీలో విస్తృతంగా సోదాలు చేశారు. పూర్తి అనుమతులు, నాణ్యత లేకుండా డెయిరీ ప్రొడక్ట్స్ తయారు చేస్తున్నట్లు ఫిర్యాదులు అందాయి. దీంతో ఫుడ్ సేఫ్టీ అధికారులు సోదాలు చేపట్టారు.
ఫుడ్ సేఫ్టీ అధికారులతో పాటు స్థానిక రెవెన్యూ అధికారులు సైతం డెయిరీలో సోదాలు నిర్వహించారు. కొన్ని గంటల పాటు తనిఖీలు చేశారు. పాల ఉత్పత్తులు ఈ డెయిరీలో తయారు చేస్తారు. అయితే, పాల ఉత్పత్తుల తయారీకి పూర్తి అనుమతులు లేకపోవడంతో పాటు కొన్ని పదార్ధాలను నిబంధనల ప్రకారం అంటే ఎక్కువ మోతాదులో కెమికల్స్ వాడుతున్నట్లు వీఎన్ఆర్ డెయిర్ పై ఆరోపణలు ఉన్నాయి. ఆరోపణలు వెల్లువెత్తిన నేపథ్యంలో ఫుడ్ సేఫ్టీ అధికారులు రంగంలోకి దిగారు. డెయిరీలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు.
Also Read..Healthy Eating : రోగాలకు దూరంగా ఉండాలంటే.. వీటిని ఆహారంలో చేర్చుకోండి !
కొన్ని గంటల పాటు తనిఖీలు చేసిన అధికారులు కొన్ని శాంపిల్స్ ను కూడా సేకరించారు. ఈ శాంపిల్స్ ను పరీక్షల కోసం ల్యాబ్ కి పంపారు. పాల ఉత్పత్తుల తయారీలో మోతాదుకి మించి ప్రోటీన్ బైండర్ వాడినట్లు అధికారులు గుర్తించారు. ల్యాబ్ నుంచి రిపోర్ట్స్ రావాల్సి ఉందని, ఆ తర్వాత మరిన్ని విషయాలు తెలుస్తాయని అధికారులు చెబుతున్నారు.
కాగా, కొన్ని సంస్థలు ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. నాసిరకం ఉత్పత్తులను తయారు చేస్తున్నాయి. మోతాదుకి మించి కెమికల్స్ వాడేస్తున్నాయి. వాటిని మార్కెట్ లోకి వదిలి సొమ్ము చేసుకుంటున్నారు. ఈ విషయాలేవీ తెలియని ప్రజలు వాటిని కొనుగోలు చేసి తమ ఆరోగ్యాన్ని దెబ్బతీసుకుంటున్నారు. నాణ్యత లేని, కెమికల్స్ తో చేసిన పాల ఉత్పత్తులతో ప్రాణాలకు ముప్పు తెచ్చుకుంటున్నారు. చేతులారా జబ్బుల బారిన పడుతున్నారు. నాణ్యత లేని ఆహార పదార్ధాలు తయారు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని అప్పుడే ఇలాంటివి జరక్కుండా ఉండే ఆస్కారం ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read..Heart Health : గుండె ఆరోగ్యానికి మేలు చేసే పెరుగు !