Payam Venkateshwarlu : మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు జైలు శిక్ష
ఖమ్మం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ప్రజా ప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది.

Venkateshwarlu
Former MLA Payam Venkateshwarlu : ఖమ్మం జిల్లా పినపాక మాజీ ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లుకు ప్రజా ప్రతినిధుల కోర్టు ఆరు నెలల జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా రూ.10 వేలు జరిమానా విధించింది. తనకు విధించిన రూ.10 వేల జరిమానాను పాయం వెంకటేశ్వర్లు చెల్లించారు. అప్పిల్ కు వెళ్లేందుకు అనుమతిస్తూ జైలు శిక్షను కోర్టు నిలిపివేసింది.
ఎన్నికల్లో ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినట్లు 2018లో అశ్వాపురం పోలీస్ స్టేషన్ లో ఈ కేసు నమోదు అయింది. ఈ కేసులో విచారణ సందర్భంగా ఎన్నికల్లో డబ్బు పంపిణీ చేశాడనే అభియోగాలు రుజువైనట్లు ప్రజా ప్రతినిధుల కోర్టు వెల్లడించింది. దీంతో పాయం వెంకటేశ్వర్లుకు ఆరు నెలల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు వెల్లడించింది.