గోడ గోడ ఏడిపిస్తుర్రు.. ఫుల్ ఎమోషనల్ అయిపోయిన జీవన్ రెడ్డి..
"కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు నేను కృషి చేస్తున్నాను. ఇక్కడి ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ను కలుషితం చేస్తున్నారు" అని తెలిపారు.
Former MLC Jivan Reddy
- జగిత్యాల పట్టణ ప్రజల ఆత్మ గౌరవానికి పరీక్ష
- గాజుల గుర్తుకే ప్రజలు ఓటు వేయండి
- బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాను
Jeevan Reddy: సమాజంలో అణచివేతకు గురి అవుతున్న వారికి అండగా నిలబడుతూ తన జీవిత చివరి అంకం వరకూ పోరాడతానని మాజీ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. కష్టపడ్డవారికి టికెట్ ఇవ్వకుండా కారు గుర్తోళ్లకు టికెట్ ఇచ్చి తనను గోడు గోడున ఏడిపిస్తున్నారని తెలిపారు.
“అధికారానికి, ఆత్మగౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ ఇది. ఇది జగిత్యాల పట్టణ ప్రజల ఆత్మ గౌరవానికి పరీక్ష. చెమట ఓడ్చి సంపాదించలేదు. అది అంతా అక్రమ సంపాదన. డబ్బులు ఇస్తే తీసుకోండి.
Also Read: ఎప్స్టీన్ ఫైల్స్లో 169 సార్లు దలైలామా పేరు? కీలక ప్రకటన చేసిన దలైలామా ఆఫీస్
ఓటు మాత్రం గాజుల గుర్తుకు వేయండి. ఇక్కడి ఎమ్మెల్యే బీసీల హక్కులను కాలరాసి, ఉన్నత వర్గాలకు కట్టబెట్టారు. బీసీలకు కేటాయించిన సీటు వారికే దక్కాలని సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి బీసీల హక్కులు కాపాడాను. బీసీల హక్కుల కోసం పోరాటం చేస్తున్నాను. బీసీల హక్కులను కాలరాసిన ఎమ్మెల్యేకు బీసీలను ఓటు అడిగే నైతిక హక్కు లేదు.
వలసవాదులను తరిమి కొట్టండి. నన్నుకున్నోళ్లకు అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకోవాలా.. అండగా నిలవాల్సిన బాధ్యత నాపై లేదా? కాంగ్రెస్ పార్టీని కాపాడేందుకు నేను కృషి చేస్తున్నాను. ఈ ఎమ్మెల్యే మాత్రం కాంగ్రెస్ను కలుషితం చేస్తున్నారు” అని తెలిపారు.
