ముఖ్యమంత్రి వెంటనే వీటిపై రివ్యూలు చేయాలి: హరీశ్ రావు

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం బద్దిపడగలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు.

ముఖ్యమంత్రి వెంటనే వీటిపై రివ్యూలు చేయాలి: హరీశ్ రావు

BRS MLA Harish Rao

Updated On : November 3, 2024 / 3:50 PM IST

రైతుల సమస్యల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోవడం లేదని తెలంగాణ మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వడ్లు కొనుగులు చేసే దిక్కు లేదని చెప్పారు. వీటిపై వెంటనే రివ్యూలు చేయాలని అన్నారు.

సిద్దిపేట జిల్లా నంగునూర్ మండలం బద్దిపడగలో ఆయన ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. 30 శాతం వడ్లను దళారులు కొన్నారని తెలిపారు. ఎలక్షన్ ముందు రైతులకు ఎన్నో హామీలు ఇచ్చారని, ఇప్పుడు చాలా జిల్లాలో రైతులు ధర్నాలు చేస్తున్నారని చెప్పారు.

సీఎం కనీసం ఒక్కసారైనా రివ్యూ చేశారా? అధికారులను అడిగిరా? అని హరీశ్ రావు అన్నారు. రైతులకు బోనస్ ఇవ్వకుండా మొండి చెయ్యి చూపించారని విమర్శించారు. రుణమాఫీకి 31 రకాల కోతలు పెట్టారని చెప్పారు. రూ.1.50 కోట్లతో మూసీ సుందరీకరణ చేస్తామంటున్నారని, కానీ, రైతులకు వడ్లకు బోనస్ బోగస్ అయిపోయిందని తెలిపారు.

హైదరాబాద్‌లో కూర్చొని మాట్లాడడం కాదని, కళ్లాల కాడికి వచ్చి చూడాలని హరీశ్ రావు చెప్పారు. చాలా చోట్ల వడ్లు తడిశాయని, తడిసిన వడ్లు కొనరు.. కలెక్టర్ రారు.. సీఎం రారు అని విమర్శించారు. ముఖ్యమంత్రి వెంటనే రివ్యూలు చేయాలని, క్షేత్రస్థాయిలో మంత్రులు, అధికారులు వచ్చి చూడాలని డిమాండ్ చేశారు.

ఏదేమైనా సరే ఇదే లక్ష్యం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది: ప్రియాంకా గాంధీ