ఏదేమైనా సరే ఇదే లక్ష్యం కోసం ప్రధాని మోదీ ప్రభుత్వం పనిచేస్తోంది: ప్రియాంకా గాంధీ
వయనాడ్‌లో ఇవాళ ఆమె ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని మాట్లాడారు.

Priyanka Gandhi
ఏదేమైనా సరే అధికారంలో ఉండాలన్నదే ప్రధాని మోదీ ప్రభుత్వ లక్ష్యమని కాంగ్రెస్ నాయకురాలు, వయనాడ్ ఎంపీ అభ్యర్థి ప్రియాంకా గాంధీ వాద్రా అన్నారు. వయనాడ్‌లో ఇవాళ ఆమె ఉప ఎన్నిక ప్రచారంలో పాల్గొని మాట్లాడారు. ప్రజల సంక్షేమం కన్నా వ్యాపారుల ప్రయోజనాలకే మోదీ ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుందని తెలిపారు.
“ప్రధాని మోదీ లక్ష్యం మీకు మెరుగైన జీవితాన్ని అందించడం కాదు. మీ కోసం కొత్త ఉద్యోగాలు ఇవ్వడం కాదు. మీకు మెరుగైన ఆరోగ్యం, విద్య అందించడం కాదు. ఏ విధంగానైనా సరే అధికారంలో కొనసాగడమే ఆ ప్రభుత్వ లక్ష్యం. దానర్థం మిమ్మల్ని విభజించడం, ద్వేషాన్ని వ్యాప్తి చేయడం, ప్రజాస్వామ్య సంస్థలను అణిచివేసేందుకు ప్రజలను హక్కులను దూరం చేయడమే” అని ప్రియాంకా గాంధీ అన్నారు.
ప్రజలకు ఏది కావాలో దాని కోసం వయనాడ్ ప్రజలు నిలబడి, అణచివేతకు వ్యతిరేకంగా పోరాడుతున్నారని ప్రియాంకా గాంధీ అన్నారు. ఈ ప్రాంతం వారు ఏ మతానికి చెందిన వారైనా సరే కలిసిమెలసి జీవిస్తున్నారని చెప్పారు. ఇక్కడి ప్రజలకు పజ్సిరాజా, తలక్కల్ చంతు, ఎడచెన కుంకన్ వంటి నాయకులకు ఉన్నట్లు ధైర్యం ఉంది, గొప్ప చరిత్ర ఉందని తెలిపారు. ఇక్కడి ప్రజలు సమానత్వం కోసం పోరాడారని అన్నారు.
VC Sajjanar: ఎటు వెళ్తోందీ సమాజం.. పండగపూట ఇదేం వికృతానందం.. సజ్జనార్ పోస్ట్ వైరల్