TS Politics : కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో టీఆర్ఎస్ నేత వేముల వీరేశం ఫోటో..హస్తం గూటికి చేరటం ఖాయమేనా..?
నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ నేతల స్వాగతం ఫ్లెక్సీలో టీఆర్ఎస్ నేత వేముల వీరేశం ఫోటో తీవ్ర కలకలం రేపుతోంది.

Vemula Veeresham Photo Controversy In Congress Party Flexi
TS Politics : నల్లగొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఫ్లెక్సీలో టీఆర్ఎస్ నేత వేముల వీరేశం ఫోటో తీవ్ర కలకలం రేపుతోంది. గత కొంతకాలంగా టీఆర్ఎస్ కు దూరంగా ఉంటున్న వేముల వీరేశం కాంగ్రెస్ పార్టీలో చేరతారనే ఊహాగాలు కొనసాగుతున్న క్రమంలో డైరెక్టుగా కాంగ్రెస్ ఫ్లెక్సీలో వేముల వీరేశం ఫోటో ఉండటం కలకలం రేపుతోంది. అంటే వేములు కాంగ్రెస్ లోకి చేరటం ఖరారు అయినట్లేనా అనే వార్తలు హల్ చల్ చేస్తున్నాయి.
నార్కెట్ పల్లి మండలం అమ్మబోలులో పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్వాగత ఫ్లెక్సీలో నకిరేకల్ టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం దర్శనమిచ్చింది. దీంతో వేముల కాంగ్రెస్ గూటికి చేరతారు అనే ప్రచారం ఊపందుకుంది.
కాగా..నల్గొండ జిల్లా నకిరేకల్ టీఆర్ఎస్‌లోని రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. మే డే సందర్భంగా జెండా ఎగురవేస్తున్న మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం వర్గీయులను ఎమ్మెల్యే లింగయ్య వర్గీయులు అడ్డుకున్నారు. పార్టీతో సంబంధం లేని మాజీ ఎమ్మెల్యే వేముల వర్గీయులు ఈ కార్యక్రమం ఎలా చేస్తారని లింగయ్య వర్గం నేతలు ప్రశ్నించారు. దీంతో రెండు వర్గాల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. నేతలు బాహాబాహీకి దిగారు. పోలీసులు జోక్యం చేసుకుని రెండు వర్గాలను చెదరగొట్టారు.