Ghatkesar Youth Kidnap : ఘట్ కేసర్ యువకుడి కిడ్నాప్ కేసులో నలుగురు అరెస్టు

బోడుప్పల్ బుద్ధ నగర్ కు చెందిన అవినాష్ రెడ్డి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారని, ఆ యువతి తన అవసరం కోసం అవినాష్ రెడ్డి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసున్నారని డీసీపీ పేర్కొన్నారు.

Ghatkesar Youth Kidnap : ఘట్ కేసర్ యువకుడి కిడ్నాప్ కేసులో నలుగురు అరెస్టు

Ghatkesar youth kidnap

Four Accused Arrest : మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా ఘట్ కేసర్ యువకుడి కిడ్నాప్ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్లు మల్కాజ్ గిరి డీసీపీ జానకి తెలిపారు. ఆదివారం మధ్యాహ్నం జరిగిన యువకుడి కిడ్నాప్ యత్నం కేసులో వేగంగా స్పందించి నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు చెప్పారు. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ తో పాటు అతని అనుచరులు ఘట్ కేసర్ లోని వందన హోటల్ వద్ద అవినాష్ రెడ్డి అనే యువకుడిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారని, స్థానికులు అడ్డుకోవడంతో వారు అక్కడి నుంచి పారిపోయారని తెలిపారు.

బోడుప్పల్ బుద్ధ నగర్ కు చెందిన అవినాష్ రెడ్డి అదే ప్రాంతానికి చెందిన ఓ యువతి ప్రేమించుకున్నారని, ఆ యువతి తన అవసరం కోసం అవినాష్ రెడ్డి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసున్నారని డీసీపీ పేర్కొన్నారు. డబ్బులు తీసుకున్నాక ఆ యువతి అవినాష్ రెడ్డిని దూరంగా పెట్టారని వెల్లడించారు. దీంతో డబ్బులు ఇవ్వాలని అవినాష్ రెడ్డి ఆ యువతిపై ఒత్తిడి చేశారు.

Cyber Fraud : ఎన్టీఆర్ జిల్లాలో భారీ సైబర్ మోసం.. అకౌంట్ల నుంచి రూ.3 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

అసహనానికి లోనైన ఆ యువతి అవినాష్ రెడ్డిని అంతం చేయాలని ప్లాన్ వేసింది. ప్లాన్ లో భాగంగా ఆ యువతి.. సిద్దిపేటకు చెందిన చక్రధర్ గౌడ్ తో అవినాష్ రెడ్డిని ఫోన్ లో మాట్లాడించారు. డబ్బులు చెల్లిస్తానని.. ఘట్ కేసర్ లోని వందన హోటల్ కు రమ్మని అవినాష్ రెడ్డికి చక్రధర్ రెడ్డి ఫోన్ లో చెప్పారు. చక్రధర్ రెడ్డి మాటలు నమ్మిన అవినాష్ రెడ్డి ఆ హోటల్ వద్దకు వెళ్లారు.

అప్పటికే వందన హోటల్ వద్ద ఉన్న చక్రధర్ గౌడ్.. అవినాష్ రెడ్డి రాగానే అతనిపై విచక్షణా రహితంగా దాడి చేస్తూ కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించారు. అవినాష్ రెడ్డి గట్టిగా అరవడంతో స్థానికులు కిడ్నాప్ ను అడ్డుకుని, చక్రధర్ గౌడ్ తోపాటు అతని అనుచరులను పట్టుకునేందుకు ప్రయత్నించగా వారు అక్కడి నుంచి పరార్ అయ్యారు.

wanted criminal shot dead : యూపీలో వాంటెడ్ క్రిమినల్ ఎన్‌కౌంటర్

అవినాష్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేయగా తమ టీమ్ వేగంగా స్పందించి నిందితులను అరెస్ట్ చేశారని డీసీపీ వెల్లడించారు. చక్రధర్ గౌడ్ తోపాటు అతని అనుచరులు నర్సింగారావు, గౌతంరాజు, వినోద్ లతోపాటు వారు వాడిన కారును సీజ్ చేసినట్లు డీసీపీ జానకి తెలిపారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి, వారిని రిమాండ్ కు తరలించినట్లు పేర్కొన్నారు.