Cyber Fraud : ఎన్టీఆర్ జిల్లాలో భారీ సైబర్ మోసం.. అకౌంట్ల నుంచి రూ.3 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే అకౌంట్ లో రూ.150 జమ అవుతాయని మోసానికి పాల్పడ్డారు. ఒకరి నుంచి మరొకరిని యాప్ లో చేర్చుకుంటే భారీగా డబ్బులొస్తాయని నమ్మించి కేటుగాళ్లు మోసగించారు.

Cyber Fraud : ఎన్టీఆర్ జిల్లాలో భారీ సైబర్ మోసం.. అకౌంట్ల నుంచి రూ.3 కోట్లు కొట్టేసిన కేటుగాళ్లు

Cybercriminals

Updated On : June 27, 2023 / 7:32 AM IST

Cybercriminals Fraud : సైబర్ నేరగాళ్లకు అడ్డూఅదుపు లేకుండా పోయింది. తరచూ మోసాలకు పాల్పడుతూనే ఉన్నారు. అమాయకులను వలలో వేసుకుని దోపిడీ చేస్తున్నారు. పోలీసులు ఎంత హెచ్చరిస్తున్నా కొంతమంది సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడి మోసపోతున్నారు. ఎన్టీఆర్ జిల్లాలో భారీ సైబర్ మోసం జరిగింది.

కంచికచర్ల మండలం పెండ్యాల గ్రామానికి చెందిన కొందరి అకౌంట్ల నుంచి రూ.2 కోట్ల నుంచి రూ.3 కోట్ల వరకు నగదు మాయం అయింది. యాప్ డౌన్ లోడ్ చేసుకుంటే అకౌంట్ లో రూ.150 జమ అవుతాయని మోసానికి పాల్పడ్డారు. ఒకరి నుంచి మరొకరిని యాప్ లో చేర్చుకుంటే భారీగా డబ్బులొస్తాయని నమ్మించి కేటుగాళ్లు మోసగించారు.

Finance Ministry: రాష్ట్రాలకు కేంద్రం నిధులు.. తెలంగాణకు రూ. 2,102 కోట్లు.. ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం..

అకౌంట్ లో కొన్ని రోజులు డబ్బులు పడినట్లు చూపించి నగదును అపహరించారు. ప్రైవేట్ ఆన్ లైన్ వెబ్ సైట్ ద్వారా డబ్బులు కొట్టేసినట్లు గుర్తించారు. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్ నుంచి వెబ్ సైట్ నిర్వహిస్తున్నట్లు సమాచారం.