తెలంగాణలో 4 మంత్రి పదవుల భర్తీకి రంగం సిద్ధం… రేసులో ఉన్న నేతలు వీరే…

ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్‌గా ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది.

తెలంగాణలో 4 మంత్రి పదవుల భర్తీకి రంగం సిద్ధం… రేసులో ఉన్న నేతలు వీరే…

CM Revanth Reddy

Updated On : June 7, 2025 / 4:56 PM IST

తెలంగాణ మంత్రివర్గ విస్తరణకు కాంగ్రెస్ హైకమాండ్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో రేపు సాయంత్రం లేదా బుధవారం క్యాబినెట్ విస్తరణ జరగనుంది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఢిల్లీ నుంచి రేపు హైదరాబాద్‌కు రానున్నారు. నాలుగు మంత్రి పదవులను భర్తీ చేయాలని కాంగ్రెస్ భావిస్తుండడం, ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ నుంచి ఒక్కొక్కరికి అవకాశం ఉండడంతో ఆయా సామాజిక వర్గాలకు చెందిన ఆశావాహులు తమపేరు ఆ లిస్టులో ఉంటుందా? ఉండదా? అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

ఓసీ నుంచి రేసులో ఉన్నవారు
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
మల్‌రెడ్డి రంగారెడ్డి
రామ్మోహన్ రెడ్డి
సుదర్శన్ రెడ్డి
ప్రేమ్ సాగర్ రావు

మంత్రివర్గ రేసులో ఉన్న బీసీ నేతలు
వాకిటి శ్రీహరి
ఆది శ్రీనివాస్

ఎస్సీ వర్గం నుంచి రేసులో ఉన్న నేతలు
వివేక్ వెంకటస్వామి
అడ్లూరి లక్ష్మణ్

ఉమ్మడి నిజామాబాద్ నుంచి సీనియర్ నేత సుదర్శన్ రెడ్డికి లైన్ క్లియర్‌గా ఉందని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. అలాగే, మంత్రి పదవి రేసులో కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా బరిలో ఉన్నారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి ఓ నేతను క్యాబినెబ్‌లో తీసుకునే అవకాశం ఉంది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన ఇద్దరు సీనియర్ నేతలు రామ్మోహన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి కూడా క్యాబినెట్ పదవిపై ఆశలు పెట్టుకున్నారు.

రంగారెడ్డి జిల్లా నుంచి ఇప్పటివరకు ప్రాతినిధ్యం లేదు కాబట్టి కచ్చితంగా తమకు అవకాశం కల్పించాలన్న డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు, ఎస్సీ సామాజిక వర్గం నుంచి ప్రాధాన్యం కల్పించే విషయంలో మొదట్లో సీనియర్ నేత వివేక్‌కు పూర్తిగా లైన్ క్లియర్‌గా ఉన్నట్టుగానే ప్రచారం జరిగింది. అయితే, మారిన పరిస్థితుల నేపథ్యంలో మాల సామాజిక వర్గానికి కాకుండా మాదిగ సామాజిక వర్గానికి మంత్రి పదవి దక్కాలన్న డిమాండ్ కూడా ఉంది.

మొత్తం ఆరు క్యాబినెట్ స్థానాలు భర్తీ కావాల్సి ఉండగా, వాటిలో ప్రస్తుతం నాలుగు క్యాబినెట్ స్థానాలు భర్తీ చేయాలని కాంగ్రెస్ భావిస్తోంది. రెండింటిని పెండింగ్ లో పెట్టాలన్న ఆలోచన ఉన్నట్టు తెలుస్తోంది.

బీసీలపై కాంగ్రెస్‌ పార్టీకి ఉన్న స్టాండ్‌ కారణంగా వారికి కచ్చితంగా ప్రాధాన్యం కల్పించాలి. అదే విధంగా ప్రస్తుతం క్యాబినెట్లో స్థానం లేని పలు జిల్లాలకు చెందిన నేతలకు ప్రాతినిధ్యం కల్పించాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం ఉన్న క్యాబినెట్లో ఉమ్మడి నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు.