NIMS Doctors Fraud : హైదరాబాద్ నిమ్స్‌లో ఘరానా మోసం.. రోగితో ప్రైవేట్ హాస్పిటల్ ఫీజు కట్టించిన వైద్యులు
హైదరాబాద్ నిమ్స్‌లో ఘరానా మోసం వెలుగుచూసింది. వైద్యం కోసం వచ్చిన ఒక వికలాంగుడైన రోగితో నిమ్స్ వైద్యులు ప్రయివేట్ హాస్పిటల్‌కు ఫీజు కట్టించారు.

Fraud In Hyderabad Nims Private Hospital Fee Charged With Patient
fraud in Hyderabad NIMS : హైదరాబాద్ నిమ్స్‌లో ఘరానా మోసం వెలుగుచూసింది. వైద్యం కోసం వచ్చిన ఒక వికలాంగుడైన రోగితో నిమ్స్ వైద్యులు ప్రయివేట్ హాస్పిటల్‌కు ఫీజు కట్టించారు. బయట నుంచి వచ్చే డాక్టర్ సర్జరీ చేస్తాడని చెప్పి…రోగి దగ్గర నుంచి 45వేల రూపాయలు వసూలు చేశారు వైద్యులు.
నిమ్స్ న్యూరో సర్జన్ వంశీకృష్ణ ఈ మోసానికి పాల్పడ్డాడు. సర్జరీ జరగకపోయినా…కుట్లు విప్పించుకోవాలని నిమ్స్ వైద్యులు డేట్ ఇవ్వడంతో మోసపోయానని బాధితుడు గ్రహించారు. నిమ్స్ వైద్యుల నిర్వాకంపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు.
నిమ్స్‌లో వంశీకృష్ణతోపాటు కొందరు వైద్యులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎన్ని ఫిర్యాదులు చేసినా నిమ్స్ డైరెక్టర్ పట్టించుకోవడం లేదని రోగులు, వారి బంధువులు ఆరోపిస్తున్నారు.