Free Chicken : బాబోయ్.. చికెన్ కోసం ఎగబడ్డ జనం.. అర కిలోమీటర్ వరకు క్యూలైన్.. గంటలోనే 25 కిలోల చికెన్, 2500 గుడ్లు ఖతం..

అవగాహన కల్పించేందుకే ఇలా ఫ్రీగా చికెన్ ఫ్రై, ఎగ్స్ పంపిణీ చేశామని నిర్వాహాకులు తెలిపారు.

Free Chicken : బాబోయ్.. చికెన్ కోసం ఎగబడ్డ జనం.. అర కిలోమీటర్ వరకు క్యూలైన్.. గంటలోనే 25 కిలోల చికెన్, 2500 గుడ్లు ఖతం..

Updated On : February 21, 2025 / 9:22 PM IST

Free Chicken : ప్రస్తుతం చికెన్ ప్రియులను బర్డ్ ఫ్లూ భయం వెంటాడుతోంది. బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ కు దూరమయ్యారు. కోడి కూర తింటే ఎక్కడ ఏ రోగం వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. అందుకే, చికెన్ తినడం మానేశారు. ఇక, కొందరు కోడి గుడ్లను చూసినా వణికిపోతున్నారు. బర్డ్ ఫ్లూ భయంతో వాటిని కూడా తినడం మానేశారు. ఈ క్రమంలో చికెన్ షాపులు వెలవెలబోతున్నాయి. చికెన్ కొనే వాళ్లు లేక వ్యాపారులు, పౌల్ట్రీ రైతులు లబోదిబోమంటున్నారు.

బర్డ్ ఫ్లూ భయంతో చికెన్, ఎగ్స్ తినేందుకు జనం జంకుతున్న వేళ.. దీనిపై అవగాహన కల్పించేందుకు పలు పౌల్ట్రీ సంస్థలు ముందుకు వచ్చాయి. చికెన్, గుడ్లు తింటే ఏమీ అవ్వదు అనే భరోసా కల్పించే ప్రయత్నంలో భాగంగా ఫ్రీ చికెన్, ఎగ్ మేళాలు నిర్వహిస్తున్నాయి.

Also Read : భూమిని ఢీకొట్టనున్న భారీ గ్రహశకలం.. డేంజర్‌లో ముంబై సిటీ.. అదే జరిగితే మహానగరం వినాశనమే..!

హైదరాబాద్ ఉప్పల్ గణేశ్ నగర్ లో ఫ్రీగా చికెన్ ఫ్రై, బాయిల్డ్ ఎగ్స్ ను అందించింది ఓ పౌల్ట్రీ సంస్థ. ఈ మేళాకు భారీగా జనం తరలివచ్చారు. ఉచితంగా ఇస్తున్న చికెన్ ఫ్రై, ఎగ్స్ కోసం జనాలు ఎగబడ్డారు.

ఈ మేళాకు జనం ఏ రేంజ్ లో జనం వచ్చారంటే.. అర కిలోమీటర్ దాకా క్యూలైన్ ఫామ్ అయ్యిందంటే అర్థం చేసుకోవచ్చు. క్యూలో నిలబడి మరీ చికెన్, ఎగ్స్ తీసుకెళ్లారు జనాలు. మేళా స్టార్ట్ చేసిన కాసేపటిలోగానే 25 కిలోల చికెన్ ఫ్రై, 2500 బాయిల్డ్ ఎగ్స్ ఖతమయ్యాయి.

బర్డ్ ఫ్లూ వల్ల ఎవరూ భయాందోళన చెందాల్సిన అవసరం లేదని.. చికెన్, గుడ్లు తింటే ఏమీ అవ్వదని, దీనిపై అవగాహన కల్పించేందుకే ఇలా ఫ్రీగా చికెన్ ఫ్రై, ఎగ్స్ పంపిణీ చేశామని నిర్వాహాకులు తెలిపారు. అంతేకాదు.. ఇలా వారం రోజుల పాటు అన్ని బ్రాంచులలో ఫ్రీగా చికెన్, ఎగ్స్ పంపిణీ చేస్తామన్నారు పౌల్ట్రీ సంస్థ నిర్వాహాకులు.

”బర్డ్ ఫ్లూ భయంతో జనాలు భయపడుతున్నారు. ఎలాంటి భయం అవసరం లేదు. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ రిపోర్టు ప్రకారం మన ఇండియన్ కుకింగ్ స్టైల్ ఫుల్ బాయిల్డ్ సిస్టమ్ ఉంది. ఫారిన్ కంట్రీస్ లో మాత్రం హాఫ్ బాయిల్డ్ సిస్టమ్ ఉంది. మన దేశంలో బాయిల్ లేదా ఫ్రై ఐటెమ్స్ తింటాం. కాబట్టి జనాలు భయపడాల్సిన అవసరం లేదు. తెలుగు రాష్ట్రాల్లో 250 వరకు స్టాల్స్ పెడుతున్నాం. ఇందులో ఫ్రీగా చికెన్, ఎగ్స్ పంపిణీ చేస్తాం. ఎవరూ భయపడాల్సిన అవసరం లేదు. హ్యాపీగా చికెన్, ఎగ్స్ తినొచ్చు” అని పౌల్ట్రీ నిర్వాహాకులు తెలిపారు.

Also Read : ఇదెక్కడి స్కీమ్ రా నాయనా.. దోమలు పట్టిస్తే డబ్బులు.. ఎక్కడో, ఎందుకో తెలుసా..

అటు ఏపీలోనూ పలు ప్రాంతాల్లో ఇలానే మేళాలు నిర్వహించారు. ఫ్రీగా చికెన్ ఫ్రై, ఎగ్స్ పంపిణీ చేశారు. అయితే, ఊహించని విధంగా జనాలు పోటెత్తడంతో.. నిర్వాహాకులు కొంత ఇబ్బంది పడ్డారు. జనాలను కంట్రోల్ చేయలేక కొన్ని చోట్ల గేట్లు వేయాల్సిన పరిస్థితి వచ్చిందని నిర్వాహాకులు తెలిపారు.