Gadari Kishore: ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు హైకోర్టులో చుక్కెదురు

గాదరి కిశోర్ వేసిన పిటిషన్ ను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై...

Gadari Kishore: ఎన్నికల ముందు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కు హైకోర్టులో చుక్కెదురు

Gadari Kishore Kumar

Updated On : August 28, 2023 / 6:29 PM IST

Gadari Kishore – BRS: తెలంగాణ(Telangana)లోని తుంగతుర్తి ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత గాదరి కిశోర్‌కు హైకోర్టు(High court )లో చుక్కెదురైంది. గాదరి కిశోర్ ఎన్నికను సవాల్ చేస్తూ గతంలో హైకోర్టులో పిటిషన్ దాఖలైన విషయం తెలిసిందే. కాంగ్రెస్ నేత అద్దంకి దయాకర్ ఆ పిటిషన్ వేశారు.

ఎన్నికల అఫిడవిట్ లో గాదరి కిశోర్ తప్పుడు సమాచారం ఇచ్చారని ఆ పిటిషన్ దాఖలు చేశారు. అయితే, అద్దంకి దయాకర్ పిటిషన్ ను కొట్టివేయాలని హైకోర్టులో గాదరి కిశోర్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్ స్వీకరణపై హైకోర్టు ఇవాళ నిర్ణయం తీసుకుంది. గాదరి కిశోర్ వేసిన పిటిషన్ ను కొట్టి వేస్తున్నట్లు ప్రకటించింది.

తదుపరి విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తున్నట్లు హైకోర్టు తెలిపింది. కాగా, తెలంగాణలో మరో మూడు నెలల్లో జరగాల్సిన ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ నుంచి మరోసారి గాదరి కిశోర్‌ పోటీ చేస్తున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించిన అభ్యర్థుల జాబితాలో తుంగతుర్తి (ఎస్సీ) నియోజక వర్గం నుంచి గాదరి కిశోర్‌ పేరు ఉంది.

INDIA 3rd Meeting: కాంగ్రెస్ ఒత్తిడికి బిహార్ నేతలు తలొగ్గారా? ముంబై సమావేశానికి ముందు నితీశ్, తేజశ్వీ ఆసక్తికర వ్యాఖ్యలు