Gaddar : గద్దర్ ఎక్కడికి వెళ్లినా చేతిలో కర్ర ఉండాల్సిందే.. అది ఎవరిచ్చారో తెలుసా?
సోమవారం మధ్యాహ్నం 12గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా అల్వాల్ లోని గద్దర్ ఇంటి వరకు అంతిమ యాత్ర జరగనుంది. అల్వాల్‌లోని మహభోది స్కూల్ గ్రౌండ్‌లో గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి.

Gaddar funeral
Gaddar Stick : ప్రజా గాయకుడు, విప్లవ వీరుడు గద్దర్ కన్నుమూశారు (Gaddar Passed Away). అనారోగ్యంతో కొన్ని రోజులుగా హైదరాబాద్ (Hyderabad)లోని అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన.. ఆరోగ్యం విషమించి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. గద్దర్‌కు పది రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. అప్పటి నుంచి ఆయన ఆసుపత్రిలోనే ఉంటూ చికిత్స తీసుకుంటున్నారు. గద్దర్ ఒగ్గు కథ, బుర్ర కథల ద్వారా పల్లె ప్రజలను అలరించారు. ఇతర రాష్ట్రాల్లోనూ ప్రదర్శనలు ఇచ్చారు. దళితులు అనుభవిస్తున్న కష్టాల గురించీ తనదైన శైలిలో ప్రదర్శనలు ఇచ్చేవారు.
గద్దర్ ఈ ఏడాది జూన్ 21న కొత్త రాజకీయ పార్టీని ప్రకటించారు. గద్దర్ ప్రజాపార్టీని స్థాపిస్తున్నట్లు చెప్పారు. ఆ పార్టీ రిజిస్ట్రేషన్‌కోసం ఆయన ఢిల్లీకి వెళ్లి కేంద్ర ఎన్నికల సంఘం అధికారులనుకూడా కలిశారు. తాను ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నానని మీడియా సమావేశంలో ప్రకటించారు. కానీ, అనారోగ్యంతో చికిత్స పొందుతూ ఆయన తిరిగిరాని లోకానికి వెళ్లిపోయారు.
Gaddar Death : ప్రజా ఉద్యమాలు, పౌరహక్కుల పోరాటాల్లో ఒక శకం ముగిసింది- గద్దర్ మృతికి చంద్రబాబు సంతాపం
గద్దర్ మృతిపట్ల రాజకీయ, సినీ ప్రముఖులు, కవులు, కళాకారులు తీవ్రదిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. గద్దర్ పార్ధివదేహాన్ని ఎల్బీ నగర్ స్టేడియంలో అభిమానులు, ప్రముఖుల సందర్శనార్ధం ఉంచారు. ఈరోజు మధ్యాహ్నం 12గంటల వరకు గద్దర్ పార్ధిదేహం ఎల్బీనగర్ స్టేడియంలో ప్రజల సందర్శనార్ధం ఉంచనున్నారు. అయితే, గద్దర్ అంత్యక్రియలు సోమవారం ప్రభుత్వ లాంఛనాలతో జరగనున్నాయి. అధికార లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. సోమవారం మధ్యాహ్నం 12గంటలకు ఎల్బీ స్టేడియం నుంచి సికింద్రాబాద్ మీదుగా అల్వాల్ లోని గద్దర్ ఇంటి వరకు అంతిమ యాత్ర జరగనుంది. అల్వాల్‌లోని మహభోది స్కూల్ గ్రౌండ్‌లో గద్దర్ అంత్యక్రియలు జరగనున్నాయి.
Gaddar: నీ పాటనై వస్తున్నానమ్మో అంటూ పలకరించే గద్దరన్న ఇకలేరు
గద్దర్ ఏ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లినా తన వెంట ఓ కర్రను పట్టుకెళ్లేవారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఈ కర్రను గద్దర్ ఎందుకు ఎప్పుడూ తన వెంటే ఉంచుకున్నారనే సందేహాలు అనేక మందిలో ఉన్నాయి. అయితే, ఆ కర్ర తన తండ్రిది అట. మొదట దానికి బుద్ధుడి జెండా ఉండేది. ఇంజినీరింగ్ కాలేజీలో చేరాక ఎర్రజెండా చేరింది. జ్యోతిబాపులేకు గుర్తుగా నీలం రంగును కూడా జత చేశారు. ప్రపంచాన్ని పీడన నుంచి విముక్తి చేయడానికే కారల్ మార్క్స్ జ్ఞాన సిద్ధాంతాన్ని తెచ్చారని, అందుకే ఎర్రజెండా కట్టినట్లు గద్దర్ చెప్పేవారు. మార్క్స్ జ్ఞాన సిద్ధాంతం, పులే, అంబేద్కర్ భావాలను కలపాలనేది తన వాదన అని పలుమార్లు గద్దర్ చెప్పారు.