Sanathnagar Incident: సనత్‌నగర్‌లో దారుణం.. పాఠశాలకు వెళ్తున్న మైనర్ బాలికపై అత్యాచారం!
హైదరాబాద్(Sanathnagar Incident) నగరం నడిబొడ్డున మైనర్ బాలికపై జరిగిన ఓ ఘోర అఘాయిత్యం తీవ్ర కలకలం రేపింది.
gang Rape on a minor girl in hyderabad Sanathnagar
- మైనర్ బాలికపై దారుణ అత్యాచారం
- సనత్‌నగర్‌లో నిందితుడి ఘాతుకం
- పోక్సో కేసు నమోదు అరెస్ట్
Sanathnagar Incident: హైదరాబాద్ నగరం నడిబొడ్డున మైనర్ బాలికపై జరిగిన ఓ ఘోర అఘాయిత్యం తీవ్ర కలకలం రేపింది. సనత్‌నగర్(Sanathnagar Incident) పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో పాఠశాలకు వెళ్తున్న ఒక చిన్నారిని లక్ష్యంగా చేసుకుని ఈ దారుణానికి ఒడిగట్టడం నగరంలో మహిళలు, పిల్లల భద్రతపై ఆందోళనలను రేకెత్తిస్తోంది.
బుధవారం ఉదయం సదరు బాలిక యథావిధిగా బడికి బయలుదేరిన క్రమంలో, షాబాజ్ అనే వ్యక్తి ఆమెను వెంబడించాడు. నిర్జన ప్రదేశానికి రాగానే నమ్మబలికి బలవంతంగా బైక్‌పై ఎక్కించుకుని, సనత్‌నగర్‌లోని ఒక పార్కుకు తీసుకెళ్లాడు. అక్కడ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ ఘోరంపై బాధితురాలి తల్లి వెంటనే పోలీసులను ఆశ్రయించడంతో, సనత్‌నగర్ పోలీసులు నిందితుడైన షాబాజ్‌పై తీవ్రమైన పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. తక్షణమే స్పందించిన పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తును ముమ్మరం చేశారు.
