Tank Bund : హైదరాబాద్‌ వాసులకు అలర్ట్ .. ఇక నుంచి ట్యాంక్‌బండ్ పై కేక్‌ కటింగ్స్‌ నిషేధం‌.. ఎందుకంటే?

ట్యాంక్ బండ్ పై పుట్టిన రోజు వేడుకల అనంతరం కేకు, ఇతర వ్యర్థాలు అక్కడే పారేసి వెళ్తుండటంతో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది.

Tank Bund : హైదరాబాద్‌ వాసులకు అలర్ట్ .. ఇక నుంచి ట్యాంక్‌బండ్ పై కేక్‌ కటింగ్స్‌ నిషేధం‌.. ఎందుకంటే?

Tank Bund

Updated On : November 8, 2023 / 12:36 PM IST

Birthday celebrations On Tank Bund : ట్యాంక్ బండ్ పై అర్థరాత్రి వేళ పుట్టిరోజు వేడుకల కేక్ కట్ చేస్తే ఆ సంతోషమే వేరు. దీంతో నగర యువత స్నేహితులతో కలిసి ట్యాంక్ బండ్ పై బర్త్ డే వేడుకలు నిర్వహించుకునేందుకు ఆసక్తి చూపిస్తుంటారు. ఆ క్షణాలను ఫోన్లలో బంధిస్తూ అందరికీ చెప్పుకుంటారు. ట్యాంక్ బండ్ ప్రాంతంలో రాత్రివేళల్లో నిత్యం పందుల సంఖ్యలో కేక్ కటింగ్స్ వంటి కార్యక్రమాలు జరుగుతుంటాయి. అయితే, ఇలా చేయడం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని జీహెచ్ఎంసీ చెబుతోంది. కేక్ కట్ చేయడంతో పాటు చెత్తాచెదారం అక్కడే వేస్తున్నారట. దీనికితోడు అర్థరాత్రి వేళ బర్త్ డే వేడుకల పేరుతో యువత వాహనాలపై ర్యాష్ డ్రైవింగ్ చేస్తున్నారు. దీంతో పరిసర ప్రాంతాల్లోని వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

Also Read : బాబోయ్ వీరబాదుడు బాదాడు.. వాంఖడే స్టేడియంలో మ్యాక్స్‌వెల్‌ విశ్వరూపం.. ఈ వీడియో చూడండి

ట్యాంక్ బండ్ పై పుట్టిన రోజు వేడుకల అనంతరం కేకు, ఇతర వ్యర్థాలు అక్కడే పారేసి వెళ్తుండటంతో జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ట్యాంక్ బండ్ పై పుట్టినరోజు వేడుకలను నిషేధిస్తూ మంగళవారం జీహెచ్ఎంసీ ఆదేశాలు జారీ చేసింది. ట్యాంక్ బండ్ పై కేక్ కటింగ్ చేస్తే చర్యలుంటాయని హెచ్చరికల బోర్డులుసైతం ఏర్పాటు చేసింది. అంతేకాదు.. పుట్టినరోజు వేడుకల ముసుగులో వ్యర్థాలు వేస్తే సీసీ కెమెరాల నిఘాతో పట్టుకొని జరిమానా విధించడం జరుగుతుందని జీహెచ్ఎంసీ తెలిపింది. జీహెచ్ఎంసీ అధికారు తీసుకున్న తాజా నిర్ణయంతో కొందరు అసంతృప్తి వ్యక్తం చేస్తుండగా, మరికొందరు సరియైన నిర్ణయమే అని పేర్కొంటున్నారు.