జీహెచ్ఎంసీ ఎన్నికలు : టీఆర్ఎస్ మూడో జాబితా…అభ్యర్థులు వీరే

TRS candidates Third List : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేయనున్న టీఆర్ఎస్ అభ్యర్థుల మూడో జాబితా విడుదలైంది. 25 మంది అభ్యర్థులతో కూడిన మూడో జాబితాను శుక్రవారం టీఆర్ఎస్ విడుదల చేసింది. బుధవారం 105 మందితో తొలి జాబితా విడుదల చేయగా, గురువారం 20 మందితో రెండో జాబితా ప్రకటించారు. మొత్తం 150 మంది అభ్యర్థులను ప్రకటించారు. చర్లపల్లి డిజిజన్ సీటు మేయర్ భార్య బొంతు శ్రీదేవి యాదవ్ కు కేటాయించారు.
పార్టీ టికెట్ పొందిన అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. ప్రచారంపై దృష్టి సారించారు.
టీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ ఓట్లు అభ్యర్థిస్తున్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాలను వివరిస్తూ టీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరుతూ ప్రచారం చేస్తున్నారు.
చర్లపల్లి బొంతు-శ్రీదేవి యాదవ్
ఏఎస్ రావు నగర్ -పి.పావనిరెడ్డి
మీర్ పేట్ హెచ్ బీ కాలనీ-ప్రభుదాస్
నాచారం-సాయిజన్ శేఖర్
చిలుకానగర్ -బి.ప్రవీణ్ ముదిరాజ్,
హబ్సిగూడ-బేతి స్వాప్నారెడ్డి
ఉప్పల్-ఏ.భాస్కర్
అత్తాపూర్-మాధవి అమరేందర్ రెడ్డి
కాచిగూడ-డా.శిరీషాయాదవ్
నల్లకుంట-జి.శ్రీదేవి
అంబర్ పేట్-విజయ్ కుమార్ గౌడ్
గోల్నాక-దాసరి లావణ్య
అడిక్ మెట్-హేమలతారెడ్డి
ముషీరాబాద్-ఈ.భాగ్యలక్ష్మీ యాదవ్
కవాడిగూడ-లాస్య నందిత
యూసుఫ్ గూడ-రాజ్ కుమార్ పటేల్
వెంగళ్ రావు-దేదీప్యరావు
నేరేడ్ మెట్ -మీనా ఉపేంద్రరెడ్డి
ఈస్ట్ ఆనంద్ బాగ్-ప్రేమ్ కుమార్
గౌతమ్ నగర్-లావణ్య
హైదర్ నగర్-నార్నే శ్రీనివాసరావు
తర్నాక-మోతి శ్రీలత
రహమత్ నగర్-సీఎన్ రెడ్డి
చందానగర్ -మంజుల రఘునాథరెడ్డి
మౌలాలి-ముంతాజ్ ఫాతిమా