పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి క్లారిటీ..

GHMC Mayor Gadwal Vijayalakshmi: సీఎం రేవంత్ రెడ్డితో భేటీపై జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి స్పందించారు.

పార్టీ మారుతున్నట్లు వస్తున్న ప్రచారంపై జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి క్లారిటీ..

Updated On : February 3, 2024 / 4:45 PM IST

సీఎం రేవంత్ రెడ్డిని జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలవడం చర్చనీయాంశంగా మారింది. దీంతో ఈ విషయంపై ఆమె వివరణ ఇచ్చారు. తను పార్టీ మారుతున్నానని వస్తున్న ఆరోపణల్లో నిజం లేదన్నారు.

జీహెచ్ఎంసీ అభివృద్ధి పనులపై ముఖ్యమంత్రితో చర్చించానుని విజయలక్ష్మి తెలిపారు. స్టాండింగ్ కమిటీ ఏర్పాటు కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయడంపై ముఖ్యమంత్రికి చెప్పానని అన్నారు. కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేయాలని తనపై కార్పోరేటర్ ఒత్తిడి తెచ్చారని తెలిపారు. ఆ అంశాన్ని కమిషనర్‌కు చెప్పానని, అయినా నిర్ణయం తీసుకోలేదని అన్నారు.

జీహెచ్ఎంసీ కమిషనర్ రోనాల్డ్ రోస్ పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసినట్లు విజయలక్ష్మి తెలిపారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రికి చెప్పడంతో సానుకూలంగా స్పందించారని అన్నారు. కౌన్సిల్ సమావేశాన్ని ఏర్పాటు చేయడం ద్వారా బడ్జెట్ ప్రతిపాదనలను ఆమోదించే విధంగా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి విజ్ఞప్తి చేశానని తెలిపారు.

రామాయణ, మహాభారతంలో ఉన్న విలన్లంతా మన రాష్ట్రంలోనే ఉన్నారు, మీరే నన్ను రక్షించాలి- సీఎం జగన్