girl kidnapped : హైదరాబాద్ లో యువతి కిడ్నాప్ కలకలం

హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్ 5లో ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది.

girl kidnapped : హైదరాబాద్ లో యువతి కిడ్నాప్ కలకలం

Girl Kidnapped

Updated On : March 31, 2021 / 11:30 AM IST

girl kidnapped in Hyderabad : హైదరాబాద్ బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్ 5లో ఓ యువతిని గుర్తు తెలియని వ్యక్తులు కిడ్నాప్ చేశారు. అర్ధరాత్రి సమయంలో ఈ ఘటన జరిగింది. కోరా భవనం దగ్గర నుంచి యువతిని ఎత్తుకెళ్లారు దుండగులు. మూడు బైక్‌లపై వచ్చిన వ్యక్తులు యువతిని కిడ్నాప్ చేసినట్టు స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు.

తనను కాపాడాలని యువతి పెద్దగా కేకలు వేయడంతో కిందకు దిగామని, అప్పటికే అక్కడ ఎవరూ లేరని స్థానికులు పోలీసులకు వివరించారు. సీసీ కెమెరాల ఆధారంగా పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివిధ కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దుండుగులు మూడు బైక్ లపై వచ్చినట్టుగా స్థానికులు పోలీసులకు చెబుతున్నారు. కిడ్నాప్ అయిన మహిళ ఎవరనే వివరాలను పోలీసులు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు.

ఎందుకు యువతిని కిడ్నాప్ చేయాల్సివచ్చింది? ఎంతమంది కిడ్నాప్ చేశారు? ఎవరెవరు వచ్చారు? అనే వివరాలను సీసీ కెమెరా ఆధారంగా పరిశీలిస్తున్నారు. పల్సర్ బైక్ యువకులు చుట్టుపక్కల చీకటిగా ఉన్న సమయంలోనే యువతిని కిడ్నాప్ చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ప్రత్యక్ష సాక్షులు చెప్పిన దాని ప్రకారం పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు కొనసాగిస్తున్నారు.