Phone Call లో పరిచయం, ప్రేమ : ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి పోరాటం

Phone Call లో పరిచయం, ప్రేమ : ప్రియుడి ఇంటి ముందు ప్రియురాలి పోరాటం

Updated On : December 26, 2020 / 6:32 PM IST

girlfriends fight : Phone Callలో పరిచయం కాస్తా..స్నేహంగా మారింది. తొందరలోనే ప్రేమగా మారిపోయింది. ఇద్దరూ చెట్టాపట్టాలేసుకుని తిరిగేవారు. పెళ్లి చేసుకుంటానని ఆ యువతి నమ్మింది. కానీ..కొద్ది రోజుల అనంతరం ఆమె కన్న కలలు హఠాత్తుగా చెదిరిపోయాయి. ఇన్ని రోజులు తనతో ప్రేమగా మాట్లాడిన వ్యక్తి మరో యువతితో పెళ్లి చేసుకుంటున్నాడనే వార్త ఆమె జీర్ణించుకోలేకపోయింది. తనకు న్యాయం చేయాలంటూ..ఆ యువతి ప్రియుడి ఇంటి ఎదుటే పోరాటానికి దిగింది. ఈ ఘటన తెలంగాణ రాష్ట్రంలోని వరంగల్ రూరల్ జిల్లా వర్దన్నపేట మండలం కొత్తపలతి గ్రామంలో చోటు చేసుకుంది.

కొత్తపలతి గ్రామంలో..ఓ యువతికి భీమదేవరపల్లి మండలం చంటయపల్లిలో నివాసం ఉండే యువకుడు రమేశ్‌కు మధ్య ఫోన్ కాల్ ద్వారా పరిచయం ఏర్పడింది. దీంతో వీరిద్దరూ తరచూ మాట్లాడుకొనే వారు. స్నేహంగా ఉన్న వీరు..రానురాను..ప్రేమికులుగా మారిపోయారు. ఈ క్రమంలో..రమేశ్ ఆర్మీ జవాన్‌గా ఎంపికయ్యాడని తెలుస్తోంది. సెలవుల్లో ఇంటికి వచ్చిన సమయంలో…వారిద్దరూ బయట తిరిగేవారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో దగ్గరయ్యామని బాధిత యువతి వెల్లడిస్తోంది.

అకస్మాత్తుగా దూరంగా ఉండడం, మాట్లాడకపోవడంతో ఆ యువతికి అనుమానం వచ్చింది. అతని ఇంటికెళ్లి ఆరా తీసింది. వేరే అమ్మాయితో పెళ్లి నిశ్చయిమైందన్న విషయం తెలిసిందని ఆవేదన వ్యక్తం చేసింది. రమేశ్‌తో పెళ్లి చేయాలని, లేకపోతే..ఆత్మహత్యే గతి అంటూ..అతని ఇంటి వద్దే పోరాటం చేస్తోంది. ఈ విషయం తెలుసుకున్న పలు మహిళా సంఘాలు ఆమెకు మద్దతు ప్రకటించాయి.