Godavari Express Derailed: ఘట్కేసర్ NFC దగ్గర పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‭ప్రెస్

జనరల్ బోగీలు బాగా డ్యామేజ్ అయ్యాయని, అందులో ఉన్నవారు ఒకరిపై మరొకరు పడడంతో కొందరికి స్పల్ప గాయాలు అయినట్లు వారు పేర్కొన్నారు. దాదాపు 500 మీటర్ల మేర ట్రాక్ దెబ్బతిందన్నదట. పట్టాలు తప్పిన 5 బోగీలను వదిలి గోదావరి ఎక్స్‭ప్రెస్ సికింద్రాబాద్ బయల్దేరింది. ఈ ఘటన కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. భువనగిరి, బీబీనగర్, ఘట్కేసర్ స్టేషన్లలో పలు రైళ్లు నిలిపిశారు.

Godavari Express Derailed: ఘట్కేసర్ NFC దగ్గర పట్టాలు తప్పిన గోదావరి ఎక్స్‭ప్రెస్

Godavari Express derailed near Ghatkesar NFC

Updated On : February 15, 2023 / 12:05 PM IST

Godavari Express Derailed: విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ వస్తున్న గోదావరి ఎక్స్‭ప్రెస్ రైలు హైదరాబాద్ శివారులో పట్టాలు తప్పింది. ఘట్కేసర్ సమీపంలోని ఎన్ఎఫ్‭సీ దగ్గర బుధవారం ఉదయం పట్టాలు తప్పినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఆయిల్ లీకవ్వడంతో ఈ ప్రమాదం జరిగినట్లు అధికారులు పేర్కొన్నారు. ప్రమాద సమయంలో రైలు 100 కిలోమీటర్ల వేగంతో ఉందని, రైలు చివరలో ఉన్న ఆరు బోగీలు పట్టాలు తప్పినట్లు వారు పేర్కొన్నారు. బోగీలు పట్టాలు తప్పినప్పటికీ బోల్తాపడకపోవడంతో ముప్పు తప్పిందని అధికారులు వెల్లడించారు. జనరల్ బోగీలు బాగా డ్యామేజ్ అయ్యాయని, అందులో ఉన్నవారు ఒకరిపై మరొకరు పడడంతో కొందరికి స్పల్ప గాయాలు అయినట్లు వారు పేర్కొన్నారు. దాదాపు 500 మీటర్ల మేర ట్రాక్ దెబ్బతిన్నదట. పట్టాలు తప్పిన 5 బోగీలను వదిలి గోదావరి ఎక్స్‭ప్రెస్ సికింద్రాబాద్ బయల్దేరింది. ఈ ఘటన కారణంగా పలు రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది. భువనగిరి, బీబీనగర్, ఘట్కేసర్ స్టేషన్లలో పలు రైళ్లు నిలిపిశారు.

Karnataka BJP chief: మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక బీజేపీ చీఫ్